»   » నిజమా? పుల్లెల గోపీచంద్ జీవితం ఆధారంగా మహేష్ సినిమా?

నిజమా? పుల్లెల గోపీచంద్ జీవితం ఆధారంగా మహేష్ సినిమా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఈ మధ్య కమర్షియల్ సినిమాలు తప్ప ప్రయోగాత్మక సినిమాలకు వీలైనంత దూరంగా ఉంటున్న మహేష్ బాబుపై ఇపుడు ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఆయన త్వరలో చేయబోయే సినిమాలో బ్యాడ్మింటన్ ఆటగాడి పాత్రను పోషించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

బ్యాడ్మింటన్ చాంపియన్ పుల్లెల గోపీచంద్ జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందుతుందని అంటున్నారు. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే...మహేష్ బావ సుధీర్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తాడట. ఇటీవల 'చందమామ కథలు' చిత్రాన్ని రూపొందించిన ప్రవీణ్ సత్తారు దీనికి దర్శకత్వం వహిస్తాడు.

Mahesh Babu to play Pullela Gopichand

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్కు జరుగుతుందని అంటున్నారు. అసలు ఇలాంటి కథల్లో మహేష్ బాబును ఊహించుకోవడం అభిమానులు సాధ్యమేనా? మహేస్ బాబు చేసే కమర్షియల్ మసాలా సినిమాలకు అలవాటు పడిన ఫ్యాన్స్ ఈ కొత్త రుచిని ఆస్వాదించడానికి సిద్ధంగా ఉంటారా? ఏమో...కాలమే నిర్ణయించాలి.

ఇక మహేష్ బాబు 'ఆగడు' సినిమా విషయానికొస్తే....శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రం ఫస్ట్ లుక్ టీజర్ ఇటీవల కృష్ణ బర్త్ డే సందర్భంగా విడుదలై మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. టీజర్ చూస్తుంటే సినిమా హిట్టవుతుందనే నమ్మకంగా ఏర్పడిందని ఫ్యాన్స్ అంటున్నారు.

English summary
A movie on the life of former badminton champion Pullela Gopichand will be made by Mahesh Babu’s brother-in-law, Sudheer Babu. Mahesh Babu will play the role of Pullela Gopichand.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu