SSMB29: మహేష్ బాబు - రాజమౌళి సినిమా టైటిల్ ఇదే.. అనౌన్స్‌మెంట్ ఎప్పుడంటే ?

SSMB29: ప్రపంచ సినీ ప్రేక్షకులంతా ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటేడ్ మూవీ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu),దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి (SS Rajamouli) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న SSMB29. భారీ బడ్జెట్ తో తెరకెక్కతోన్న ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఒరిస్సా, కెన్యా, నైరోబీ, టాంజానియా వంటి అంతర్జాతీయ ప్రదేశాల్లో ఇప్పటికే నాలుగు షెడ్యూల్స్‌ పూర్తి చేసుకున్న ఈ గ్లోబల్ అడ్వెంచర్ మూవీపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే.. ఈ మూవీ టైటిల్ ఇదే అంటూ ఓ వార్త నెట్టింట్లో తెగ వైరలవుతోంది. ఇంతకీ ఈ మూవీ టైటిల్ ఎంటీ?

రాజమౌళి సినిమా అంటేనే ఓ క్రేజ్ .. భారీ హైప్.. అలాంటి డైరెక్టర్ .. సూపర్ స్టార్ మహేష్ బాబుతో వస్తున్న సినిమాపై ఎలాంటి అంచనాలు ఉంటాయో చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాపై హైప్స్ క్రియేట్ చేయడానికి ఇటీవల రాజమౌళి సోషల్ మీడియాలో మహేష్ ప్రీ-లుక్ ఫోటోను పంచుకున్నారు. ప్రిన్స్ మెడలో నంది, త్రిశూలం, ఢమరుకం ఉన్న లాకెట్ ధరించిన ఆ లుక్ చూసిన వెంటనే అభిమానుల్లో సెన్సేషన్ క్రియేట్ అయ్యింది. ఆ లుక్ చూసి సినిమాలో డివోషనల్ టచ్ ఉండబోతుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. ఇక పూర్తి ఫస్ట్ లుక్ నవంబర్ 16న విడుదల చేయనున్నట్లు జక్కన్న ముందుగానే ప్రకటించడంతో, ఆ రోజునే టైటిల్ అనౌన్స్‌మెంట్ ఉంటుందని సినీ వర్గాల సమాచారం.

Mahesh Babu Rajamouli s SSMB29 Title Vaaranaasi Viral First Look Announcement Date Out

ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఈ చిత్రానికి సంబంధించిన మరో వార్త వైరల్ అవుతోంది. ఈ మూవీకే "వారణాసి (Vaaranaasi)" అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు ఒక హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. కొందరు అభిమానులు ఈ టైటిల్‌కి ఫుల్ సపోర్ట్ ఇస్తుండగా, మరికొందరు మాత్రం ఇది రాజమౌళి తరహా గ్లోబల్ టచ్‌కి సరిపడదని అభిప్రాయపడుతున్నారు. రాజమౌళి గతంలో "#GlobeTrotter" అనే ట్యాగ్‌లైన్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ హ్యాష్‌ట్యాగ్ ఇప్పుడు మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చింది.

శ్రీ దుర్గా ఆర్ట్స్ పతాకంపై కె.ఎల్. నారాయణ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం ఇండియన్ సినిమాకు కొత్త మైలురాయిగా నిలుస్తుందన్న అంచనాలు ఉన్నాయి. RRRతో గ్లోబల్ స్థాయిలో పేరు తెచ్చుకున్న రాజమౌళి, ఇప్పుడు మహేష్ బాబుతో గ్లోబల్ లెవల్ సినిమాను తెరకెక్కించబోతున్నారు. జంగిల్ బేస్డ్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు ప్రపంచాన్ని చుట్టే సాహసికుడిగా కనిపించనున్నారని సమాచారం. హాలీవుడ్ స్థాయిలో విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు ఉండనున్నాయనే టాక్ ఫిలిం నగర్‌లో వినిపిస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండగా, మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనున్నారు.

ఇకపోతే, సినిమాకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు, టైటిల్ లీక్ అవుతున్నందున అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా.. సినిమాపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. ఇక నవంబర్ 16న మహేష్ బాబు ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్‌ను కూడా విడుదల చేస్తారని, ఇందుకోసం రామోజీ ఫిలిం సిటీలో స్పెషల్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే దీనిపై రాజమౌళి టీమ్‌ నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. ఏదేమైనా... మహేష్ బాబు - రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న ఈ గ్లోబ్‌ట్రాటర్ మూవీ ఇప్పటికే పాన్-వరల్డ్ లెవెల్‌లో హైప్ క్రియేట్ చేసింది. అయితే.. "వారణాసి" అనే టైటిల్ గానీ, మరో పేరుగానీ చివరికి ఏది ఫైనల్ అయినా, ఈ మూవీ మాత్రం ఇండియన్ సినిమా హిస్టరీలో నయా రికార్డులు క్రియేట్ చేయబోవడం ఖాయం అని అభిమానులు భావిస్తున్నారు.

More from Filmibeat

Read more about: ssmb29 ss rajamouli mahesh babu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X