»   » మహేష్ నిర్ణయం కరెక్టో కాదో ...తేలుద్ది

మహేష్ నిర్ణయం కరెక్టో కాదో ...తేలుద్ది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : హీరోలు జడ్జిమెంట్...ఒక స్క్రిప్టుని ఓకే చేయటం,రిజెక్టు చేయటంలో తెలుస్తూంటుంది అంటారు. ఆ మధ్యన లింగు స్వామి వచ్చి మహేష్ కు ఓ కథని నేరేట్ చేసారు. అయితే మహేష్ ఆ కథని రిజక్ట్ చేసారు. ఆ కథే ఇప్పుడు అంజాన్ చిత్రంగా రూపొందిందని సమాచారం. సూర్య,సమంత కాంబినేషన్ లో రూపొందిన ఈ చిత్రం తెలుగులో సికిందర్ టైటిల్ తో ఆగస్టు 15 న విడుదల అవుతోంది. ఈ చిత్రం విజయం పై మహేష్ తీసుకున్న నిర్ణయం కరెక్టే కాదో తెలుస్తుందని అంటున్నారు. అయితే ఓ చిత్రం రిజెక్టు చేయటానికి స్క్రిప్టు ఒకటే కారణం కాదనేది మాత్రం సినీ పరిశ్రమలో అందరికీ తెలిసిన విషయమే.

సూర్య, సమంత కలిసి నటిస్తున్న సినిమా 'అంజాన్'. తెలుగు - తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతోంది. లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. తమిళంలో తిరుపతి బ్రదర్స్, యు టీవీవీ మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ టీజర్ కోసం తెలుగులోనూ వెయిటింగ్. తెలుగులో సూర్యకి మంచి మార్కెట్ ఉండటం, అలాగే ఎన్టీఆర్ రభసకు పోటీగా ఈ చిత్రం వేస్తూండటంతో టాలీవుడ్ మొత్తం ఈ చిత్రం టీజర్ కోసం ఎదురుచూస్తోంది. లింగు స్వామి ఈ చిత్రాన్ని ఓ రేంజిలో తీసాడని తమిళంలో టాక్ నడుస్తోంది. దానికి తగ్గట్లే తెలుగు నిర్మాత లగడపాటి శ్రీధర్ భారీ మొత్తం ఇచ్చి మంచి పోటీలో ఈ చిత్రం డబ్బింగ్ రైట్స్ సొంతం చేసుకోవటం వార్తల్లో నిలిచింది.

Mahesh Babu reject Anjaan Scrippt?

మరోప్రక్క ఇన్నాళ్లూ ఫ్యామిలీ లుక్ లో కాస్త ఒద్దికగా సమంతను చూసిన వారు ఆమె తాజా చిత్రం లో ఆమె లుక్ ని షాక్ అవుతున్నారు. లింగుస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న అంజాన్ చిత్రం స్టిల్స్ ఇప్పుడు తెలుగు,తమిళ భాషల్లో సంచలనం సృష్టిస్తున్నాయి.

"నేను ఇంత వరకు పనిచేసిన వ్యక్తుల్లో ది బెస్ట్ టీమ్ 'అంజాన్' టీమ్. చాలా నైస్ టీమ్. కావాలంటే ఈ విషయంలో ఎవరితోనైనా బెట్ కట్టడానికి సిద్ధంగా ఉన్నాను. నేను చాలా కంఫర్టబుల్‌గా పనిచేయడానికి కావాల్సిన అన్ని సదుపాయాలను సమకూర్చారు'' అని అంటున్నారు సమంత. సూర్యతో కలిసి ఆమె నటిస్తున్న సినిమా 'అంజాన్'.
శుక్రవారంతో షూటింగ్ పూర్తయిందని సమంత ట్విట్టర్ ద్వారా తెలిపారు.

లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఇది. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 15న ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తిరుపతి బ్రదర్స్, యూటీవీ మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది.

రెండు భిన్నమైన పాత్రల్లో సూర్య కనిపించనున్నట్లు సమాచారం.ఒక పాత్రలో సూర్య గడ్డంతో కనిపించనున్నట్లు చిత్రవర్గాలు చెబుతున్నాయి. ప్రపంచంలోనే తొలిసారిగా ఈ సినిమా కోసం రెడ్‌ డ్రాగన్‌ కెమెరాను వినియోగిస్తున్నామని కెమెరామెన్‌ సంతోష్‌శివన్‌ తెలిపారు. విద్యుత్‌ జమ్వాల్‌, మనోజ్‌బాజ్‌పాయ్‌, వివేక్‌, బ్రహ్మానందం, సూరి తదితరులు నటిస్తున్నారు. యూటీవీ మోషన్‌ పిక్చర్స్‌, తిరుపతి బ్రదర్స్‌ సంయుక్తంగా దీనిని నిర్మిస్తున్నాయి. యువన్‌ శంకర్‌రాజా సంగీతం సమకూర్చుతున్నారు.

English summary
Surya's Anjaan, which was first narrated to Mahesh and got rejected.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu