»   » మహేష్ కు ఇలాంటి సెంటిమెంట్ ఉందని మీకు తెలుసా?

మహేష్ కు ఇలాంటి సెంటిమెంట్ ఉందని మీకు తెలుసా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినిమా ఇండస్ట్రీలో అంటేనే ఎన్నో సెంటిమెంట్స్ మయం. ఈ ఫీల్డ్ లో ఒక్కొక్కరికీ ఒక్కో సెంటిమెంట్ ఉంటుంది. కోట్లుతో కూడిన వ్యాపారం కాబట్టి ఎవరూ ఇక్కడ ఏ విషయంలోనూ తప్పు పట్టరు.

అలాగే మహేష్ బాబు కూడా కెరీర్ పరంగా కొన్ని సెంటిమెంట్స్ ఉన్నాయని సమాచారం. అందులో ముఖ్యంగా... ఆయన తన చిత్రం షూటింగ్ తొలి రోజు హాజరు కారు. అలాగే పూజా కార్యక్రమాల్లో సైతం మహేష్ ఎక్కడా కనిపించరు. ఆయన సెంటిమెంట్ అది.

ఆయన చిత్రాలు...అతడు, దూకుడు, ఆగడు, 1 నేనొక్కడినే , బ్రహ్మోత్సవం ఇలా మీరు ఏ సినిమా తీసుకున్నా పూజా కార్యక్రమాలు, షూటింగ్ మొదటిరోజున మహేష్ కనిపించం జరగదు. ఇప్పుడు ఆయన మురుగదాస్ సినిమాకి కూడా అదే సెంటిమెంట్ ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది.

అలాగే మరో విషయంలో కూడా మహేష్ జాగ్రత్తలు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. మే నెల‌లో రిలీజైన మ‌హేష్ చిత్రాలు నిజం, నాని, బ్ర‌హ్మోత్స‌వం అంచ‌నాల‌ను రీచ్ కాలేక‌ డిజాస్టర్ అయ్యాయి. దీంతో తన తదుపరి మూవీని ఏప్రిల్ లో రిలీజ్ చేయాల‌నుకుంటున్నార‌ట‌. అదీ కూడా పోకిరి రిలీజ్ డేట్ ఏప్రిల్ 28న రిలీజ్ చేయాల‌నుకుంటున్న‌ట్టు స‌మాచారం.

స‌క్సెస్ కోసం సెంటిమెంట్ ఫాలో అవ్వాల‌నుకుంటున్న మ‌హేష్ మురుగుదాస్ మూవీతో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తాడ‌ని అబిమానులు ఆశిస్తున్నారు. మురుగదాస్ దర్శకత్వంలో ఎన్వీ ప్రసాద్, ఠాగూర్ మధులు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ జూలై 15న హైదరాబాద్లో మొదలు కానుంది. మొదటి రోజు మహేష్ బాబు రావటం లేదు. షూటింగ్ కి హాజరుకావడం లేదు.

తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కనున్న ఈ సినిమాలో మహేష్ బాబు సరసన బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా హీరోయిన్ గా ఎంపికైందని సమాచారం. దర్శక, నిర్మాతలు అధికారికంగా ప్రకటించలేదు. ఈ సినిమా కోసం పరిణీతి తెలుగు నేర్చుకోబోతోందని తెలుస్తోంది.

స్లైడ్ షోలో మరిన్ని విశేషాలు..

దర్శకుడు రెమ్యునేషన్

దర్శకుడు రెమ్యునేషన్

ఈ చిత్రం నిమిత్తం దర్శకుడు మురగదాస్ కు ఇరవై కోట్లు రెమ్యునేషన్ క్రింద ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఓ దర్శకుడు కి సౌతిండియాలో ఈ స్దాయి రెమ్యునేషన్ అంటే నమ్మలేని విషయం.

హీరోయిన్ కు ఎంత

హీరోయిన్ కు ఎంత

మరో ప్రక్క చిత్రంలో హీరోయిన్ గా పరిణితి చోప్రాను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. తెలుగులో లో మొదటి సారి ఎంట్రీ ఇస్తున్న పరిణితికు మూడున్నర కోట్లు ఇస్తున్నారని సమాచారం.

మరి మహేష్ కు ఎంత

మరి మహేష్ కు ఎంత

మరి ఇందులో మహేష్ రెమ్యునేషన్ ఎంత అంటారా.. 23 కోట్లు అని తెలుస్తోంది.

బడ్జెట్

బడ్జెట్

దాంతో మొదట 85 కోట్ల కోట్లు అనుకున్న ఈ చిత్రం 110 కోట్ల బడ్జెట్ కి చేరిందని వినికిడి.

విలన్ కు సైతం

విలన్ కు సైతం

ఈ సినిమాలో విలన్ గా చేస్తున్న ఎస్ జె సూర్య కు సైతం బాగానే ముట్ట చెప్తున్నట్లు సమాచారం.

ఎప్పటి నుంచీ

ఎప్పటి నుంచీ

ఫ్యామిలీ టూర్ నుంచి మహేష్ రాగానే, జూలై 15 నుంచి షూటింగ్ మొదలవుతుంది.

పాటతో

పాటతో

ఈ చిత్రం షూటింగ్ సాంగ్ షూటింగ్ తో మొదలుపెట్టనున్నారు.

పరిణితినే ఫైనల్

పరిణితినే ఫైనల్

ఈ చిత్రంలో మహేష్ సరసన పరిణితి చోప్రానే హీరోయిన్ గా ఫైనలైజ్ చేసినట్లు తెలుస్తోంది.

అక్షయ్ కుమార్ లేడు

అక్షయ్ కుమార్ లేడు

అలాగే బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ విలన్‌గా నటించనున్నాడనే వార్తలో నిజం లేదని దర్శకుడు మురుగదాస్ స్పష్టం చేశారు. ఆ పాత్రలో దర్శకుడు ఎస్.జె.సూర్యనే ఖరారు చేశారట.

ఇప్పటికే రెండు పాటలు

ఇప్పటికే రెండు పాటలు


హారీశ్ జయరాజ్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రం కోసం ఇప్పటికే లేటెస్ట్ ట్రెండ్ కు తగినట్లు రెండు పాటలు ఇచ్చారని తెలుస్తోంది

ఇంటిలిజెన్స్

ఇంటిలిజెన్స్

ఈ చిత్రంలో మహేశ్ ఇంటిలిజెన్స్ అధికారి పాత్రలో కనిపించనున్నాడట. ఆ పాత్ర చాలా షార్ప్గ్ గా రియాక్ట్ అవుతుందని అంటున్నారు.

భారీ సెంట్స్

భారీ సెంట్స్

ఈ సినిమాకోసం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో ఓ భారీ సెట్ వేస్తున్నారు. ఆ సెట్‌లో సాంగ్ చిత్రీకరణతో సినిమా ప్రారంభిస్తారని తెలిసింది.

అదిరిపోయే విజువల్స్

అదిరిపోయే విజువల్స్

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ ఈచిత్రంతో మరోసారి తన కెమెరా పనితనం చూపించనున్నారు.

క్లాస్,మాస్

క్లాస్,మాస్

ఈ సినిమాతో అటు క్లాస్, ఇటు మాస్ ఆడియన్స్ ని మెప్పించాలని మురగదాస్ స్క్రిప్టు రెడీ చేసారట.

నో బ్రేక్స్

నో బ్రేక్స్

నాన్‌స్టాప్‌గా షూటింగ్‌ పూర్తి చేయడానికి మహేష్‌, మురుగదాస్‌ ప్లాన్‌ చేశారు. దాదాపు ఎక్కడా బ్రేక్ లేకుండా , అదే మూడ్ లో సినిమా మొత్తం లాగాలని ఆయన ప్రయత్నంట

సీరియస్ గా

సీరియస్ గా

ఈ సినిమాలో మహేష్ బాబు పాత్ర ...అతడు ని గుర్తు చేస్తూ చాలా సీరియస్ గా సాగుతుందని అంటున్నారు.

హిందీలో కూడా

హిందీలో కూడా

ఈ సారి ఈ సినిమాతో మహేష్ డైరక్ట్ గా హిందీ మార్కెట్ లోకి వెళ్తారని తెలుస్తోంది. ‘గజనీ', ‘హాలిడే' (తుపాకీ హిందీ రీమేక్‌) చిత్రాలతో దర్శకుడు మురుగదాస్‌ ఉత్తరాది ప్రేక్షకులకు చేరువ కావటం ప్లస్ అవుతుందంటున్నారు.

దూకుడు,పోకిరి

దూకుడు,పోకిరి

ఈ చిత్రం మహేష్ గత చిత్రాలు దూకుడు,పోకిరిలలో పోలీస్ గా కనిపించి హిట్ కొట్టడంతో మరోసారి అలాంటి పాత్ర కావటంతో ఫ్యాన్స్ పండుగచేసుకుంటున్నారు.

లీగల్ లూప్ హోల్స్

లీగల్ లూప్ హోల్స్

ఈ కథ ..చట్టంలోని లొసుగులతో తప్పించుకునే క్రిమినల్స్ ని ఎదుర్కొనే ఇంటిలిజెన్స్ అధికారి పాత్రగా రూపొందుతోంది.

ప్రెస్టేజియస్ గా

ప్రెస్టేజియస్ గా

మురగదాస్ ఎట్టిపరిస్దితుల్లోనూ ఈ సినిమాతో తెలుగులో హిట్ కొట్టాలనుకుంటున్నారు. గతంలో ఆయన తెలుగులో చిరంజీవితో స్టాలిన్ చిత్రం చేసారు. ఆ చిత్రం అంతలా వర్కవుట్ కాలేదు.

English summary
A sentiment is in discussion regarding Super Star Mahesh Babu’s upcoming film with AR Murugadoss.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu