»   » ‘బ్రహ్మోత్సవం’: ట్రిమ్మింగ్ , రెండు పాటలు,కొన్ని సీన్స్ తొలిగింపు, కారణం?

‘బ్రహ్మోత్సవం’: ట్రిమ్మింగ్ , రెండు పాటలు,కొన్ని సీన్స్ తొలిగింపు, కారణం?

Posted By:
Subscribe to Filmibeat Telugu

  హైదరాబాద్ : సినిమా రిలీజ్ అయ్యాక లెంగ్త్ ఎక్కువైందని ఫీలైతే ట్రిమ్ చేయటం సహజం. కానీ కొందరు నిర్మాతలు రిలీజ్ తర్వాత వచ్చే పరిణాలను, మార్కెట్ ని సర్వే చేసి, పరిశీలించి ముందే ఎంత లెంగ్త్ ఉంటే ఎక్కుతుందనే విషయంపై అంచనాలకు వస్తున్నారు. దానికి తగినట్లుగా ఎడిటింగ్ టేబుల్ వద్దే జాగ్రత్తలు పడుతున్నారు. మహేష్ తాజా చిత్రం 'బ్రహ్మోత్సవం'కు అలాంటి నిర్ణయమే తీసుకున్నట్లు సమాచారం.

  అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో ఎనిమిది పాటలు ఉన్నాయి. అలాగే రన్ టైమ్ రెండు గంటల ఇరవై నిముషాలు. అయితే మొదట ఈ చిత్రాన్ని 2 గంటల 35 నిముషాలు డ్యూరేషన్ ఉండేలా ఎడిట్ చేసారు.


  కానీ నిర్మాతలు మాత్రం పట్టుపట్టి..ప్రస్తుతం తక్కువ డ్యూరేషన్ ఉన్న సినిమాల ట్రెండ్ నడుస్తోందని, చెప్పి దర్శకుడుని ఒప్పించి రెండు పాటలను తీసేయించి, స్క్రీన్ ప్లేని మరింత టైట్ గా ,క్రిస్ప్ గా ఉండేలా చేయించారని తెలుస్తోంది. దాంతో రెండు గంటల ఇరవై నిముషాలకు అవుట్ పుట్ రెడీ అయ్యిందని వినికిడి. ఇలా లెంగ్త్ తగ్గించటం, ఫ్యామిలీ ఆడియన్స్ ని ధియేటర్ కు ఎట్రాక్ట్ చేయటానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.


  Also See: ఇండియా వైడ్ సర్వే: టాప్ 10లో మహేష్.. 50లో రానా, ప్రభాస్, చెర్రీ!


  సమ్మర్ స్పెషల్ గా రెడీ అయిన పెద్ద సినిమాలు ధియోటర్స్ వద్ద బారులు తీరుతున్నాయి. ఇప్పటికే మెగా క్యాంప్ నుంచి రెండు పెద్ద సినిమాలు వచ్చాయి. వాటిలో సర్దార్ గబ్బర్ సింగ్ డిజాస్టర్ అయితే సరైనోడు..టాక్ తో సంభందం లేకుండా కలెక్షన్స్ కుమ్ముతోంది. ఇక ఇప్పుడు మరో పెద్ద సినిమా భాక్సాఫీస్ ని ఊరిస్తోంది. అదే మహేష్ 'బ్రహ్మోత్సవం'.


  తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ లిరికల్ వీడియో విడుదల చేశారు. మరి ఆ వీడియో ని చూసిన వారు సినిమా స్టోరీ లైన్ పై ఓ అంచనాకు వచ్చేస్తున్నారు.  మరిన్ని విశేషాలు..స్లైడ్ షోలో కొత్త ఫొటోలతో ...


  బోల్డంత స్టార్ కాస్ట్

  బోల్డంత స్టార్ కాస్ట్

  సమంత, కాజల్‌, ప్రణీత, సత్యరాజ్‌, నదియా, రేవతి... ఇలా బోల్డంత స్టార్‌ కాస్ట్‌ ఉన్న సినిమా ఇది.  మినిమం

  మినిమం

  ప్రతీ ఫ్రేములోనూ కనీసం నలభైమంది ఆర్టిస్టులు కనిపిస్తారట.  సందడి సందడిగా..

  సందడి సందడిగా..

  అంటే..పండగ రోజునో, పెళ్లి రోజునో ఇల్లంతా ఎంత సందడిగా ఉంటుందో.. ఈ సినిమా అంత సందడిగా ఉంటుందన్నమాట.  లోటు తీరుస్తుంది

  లోటు తీరుస్తుంది

  ఓ పరిపూర్ణమైన కుటుంబ కథా చిత్రం చూసి ఎన్నాళ్లయ్యిందో.. ఆ లోటు ‘బ్రహ్మోత్సవం' తీర్చబోతోందన్నమాట.  సమ్మర్ ట్రీట్

  సమ్మర్ ట్రీట్

  వేసవిలో ఇదే సరైన సినిమా అని సినీ జనాలూ నమ్ముతున్నారు.  మార్కెట్ వర్గాల్లో

  మార్కెట్ వర్గాల్లో

  అందుకే బ్రహ్మోత్సవం మార్కెట్‌ వర్గాల్లోనూ ఆసక్తి పెంపొందిస్తోంది. ఇప్పటికి అన్ని ఏరియాల హక్కుల్నీ ఆమ్మేశారని తెలుస్తోంది.


  ప్రీ రిలీజ్

  ప్రీ రిలీజ్

  ఆ విలువ రూ.80 కోట్లపైమాటే అట. ఈ సినిమా మొత్తం ఓ వంద కోట్ల వరకూ బిజినెస్‌ చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది.


  తొలిసారి

  తొలిసారి

  ‘బాహుబలి' తరవాత ఓ తెలుగు సినిమా వంద కోట్ల బిజినెస్‌ చేయడం ఇదే తొలిసారి.


  150 దాటుతుందనే

  150 దాటుతుందనే

  ‘శ్రీమంతుడు' బాక్సాఫీసు దగ్గర దాదాపుగా రూ.150 కోట్లు సాధించింది. ఆ నమ్మకంతోనే బయ్యర్లు ఈ సినిమాకి భారీ రేట్లకు కొంటున్నారని తెలుస్తోంది.  రిలీజ్ డేట్

  రిలీజ్ డేట్

  మే 20న ‘బ్రహ్మోత్సవం' ప్రేక్షకుల ముందుకు వస్తోందని చిత్రవర్గాలు చెబుతున్నాయి.  నెల పాటు

  నెల పాటు

  ఇక నుంచి ఓ నెల రోజుల పాటు బాక్సాఫీసు దగ్గర ‘బ్రహ్మోత్సవం' సందడే కనిపించబోతోందన్నమాట.


  హంగామా

  హంగామా

  మహేష్‌బాబు సినిమా వస్తోందంటే ఆ హంగామానే వేరుగా ఉంటుంది.  ఎదురుచూపులు

  ఎదురుచూపులు

  ఈసారి ఎలాంటి మ్యాజిక్‌ చేస్తాడో అని ఆశగా ఎదురుచూస్తుంటారు అభిమానులు.


  ప్రూవ్ చేస్తుంది

  ప్రూవ్ చేస్తుంది

  మహేష్‌ సినిమాల ప్రతాపం ఏ స్థాయిలో ఉంటుందో బాక్సాఫీసుకీ బాగా తెలుసు.


  అందుకే

  అందుకే

  ‘పోకిరి'తో గత రికార్డుల్ని తిరగరాశాడు మహేష్‌. మొన్నటికి మొన్న ‘శ్రీమంతుడు' కూడా సిరిమంతుడై నిలిచాడు. ఇప్పుడు అందరి చూపూ ‘బ్రహ్మోత్సవం' పై పడింది.


  ముఖ్యంగా..

  ముఖ్యంగా..

  ఆ టైటిల్, పోస్టర్లు, అందులో మహేష్‌బాబు గెటప్‌, ఒకొక్కటిగా బయటకు వస్తున్న పాటలూ ఇవన్నీ చూస్తుంటే ఇది సకుటుంబ సపరివార సమేతంగా చూడదగిన సినిమా అనే విషయం మాటిమాటికీ రుజువైపోతూ, రోజురోజుకీ బలబడిపోతోంది.


  ప్రధానంగా

  ప్రధానంగా

  పైగా ఇది శ్రీకాంత్‌ అడ్డాల చిత్రం.గతంలో ఇదే హీరోతో సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు అంటూ పెద్ద హిట్ ఇచ్చాడు.  మన కథలే

  మన కథలే

  శ్రీకాంత్ అడ్డాల కథలన్నీ మన నట్టింట్లో పుట్టినవే. కుటుంబ సభ్యుల అనుబంధాలు, అనురాగాలు, ఆప్యాయతలు వీటి చుట్టూనే తిరుగుతాయ్‌ అవి.


  ఈసారి కూడా..

  ఈసారి కూడా..

  ఈసారీ... అలాంటి సినిమానే తీశాం అని చిత్రబృందం కూడా గట్టిగానే చెబుతోంది.  ఆడియో డేట్

  ఆడియో డేట్

  మిక్కీ జె.మేయర్‌ స్వరపరిచిన బాణీలు మే 7న విడుదల అవుతున్నాయి. ఈనెలలోనే సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


  గ్రాండ్ గా..

  గ్రాండ్ గా..

  ఈ చిత్ర ఆడియో ఫంక్షన్ మే 7న గ్రాండ్‌గా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.  మంచి హిట్ అవుతుందని

  మంచి హిట్ అవుతుందని

  మిక్కీ జే మేయర్ అందించిన ట్యూన్స్ సంగీత ప్రియులను మరింతగా అలరిస్తాయని యూనిట్ భావిస్తుంది.  ప్రమోషన్స్

  ప్రమోషన్స్

  మే మూడో వారంలో బ్రహ్మోత్సవం మూవీ విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. ఇందుకు తగినట్లే ప్రమోషన్స్ వేగం పెంచేసారు.


  ఏదో విధంగా

  ఏదో విధంగా

  రోజూ ఏదో విధంగా వార్తల్లో ఉండేటట్లు చూసుకుంటున్నారు. ఇప్పటికే ఈ మూవీకు సంబంధించిన పోస్టర్స్, టీజర్స్ ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్నాయి.  కాంబినేషన్

  కాంబినేషన్

  ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమా తర్వాత శ్రీకాంత్ అడ్డాల - మహేష్ - సమంత కలయికలో వస్తోన్న చిత్రం కావటంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.  ఒకేసారి

  ఒకేసారి

  తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ సినిమాలో సత్యరాజ్, రేవతి తదితరులు కీలక పాత్రల్లో నటించారు.  నిర్మాత ప్రసాద్‌ వి.పొట్లూరి మాట్లాడుతూ ..

  నిర్మాత ప్రసాద్‌ వి.పొట్లూరి మాట్లాడుతూ ..

  ''సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' తర్వాత మహేష్‌, శ్రీకాంత్‌ అడ్డాల కాంబినేషన్‌లో వస్తోన్న మా 'బ్రహ్మోత్సవం' చిత్రంపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో చాలా హై ఎక్స్‌పెక్టేషన్స్‌ వున్నాయి. దానికి తగ్గట్టుగానే సినిమా చాలా అద్భుతంగా రూపొందుతోంది.


  అద్బుతమైన

  అద్బుతమైన

  నిర్మాత కంటిన్యూ చేస్తూ..ఈ చిత్రానికి మిక్కీ జె. మేయర్‌ అద్భుతమైన సంగీతాన్ని అందించారు.


  సూపర్ రెస్పాన్స్

  సూపర్ రెస్పాన్స్

  ఈ చిత్రంలోని 'వచ్చింది కదా అవకాశం..' అనే పాటను నిన్న రిలీజ్‌ చేశాం. ఈ పాటకు చాలా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ఈ పాటతో ఈ సినిమా మీద ఎక్స్‌పెక్టేషన్స్‌ మరింత పెరిగాయి.


  పెద్ద హైలెట్

  పెద్ద హైలెట్

  మిక్కీ జె.మేయర్‌ మ్యూజిక్‌ సినిమాకి చాలా పెద్ద హైలైట్‌ అవుతుందని ఈ పాటకు వస్తున్న రెస్పాన్స్‌ చూస్తుంటే తెలుస్తోంది.  ఆడియో పైన కూడా

  ఆడియో పైన కూడా

  ఈ పాట రిలీజ్‌ అయిన తర్వాత ఆడియోపై కూడా ఎక్స్‌పెక్టేషన్స్‌ పెరిగాయి.


  గ్రాండ్ గా చేస్తాం

  గ్రాండ్ గా చేస్తాం

  మే 7న మా 'బ్రహ్మోత్సవం' చిత్రం ఆడియోను చాలా గ్రాండ్‌గా రిలీజ్‌ చెయ్యబోతున్నాం.  ఖచ్చితంగా

  ఖచ్చితంగా

  మహేష్‌, శ్రీకాంత్‌ అడ్డాల, మిక్కీ జె.మేయర్‌ కాంబినేషన్‌లో ఇది మరో మ్యూజికల్‌ హిట్‌ అవుతుంది'' అన్నారు నిర్మాత.


  వారణాసిలోనూ..

  వారణాసిలోనూ..

  ఈ సినిమా ప్రస్తుతం వారణాసిలో ఓ షెడ్యుల్ జరుపుకుంది. ఈ షెడ్యూల్‌లో మహేశ్, సమంతలతో పాటు ఇతర తారాగణంపై కొన్ని కీలక సన్నివేశాలని చిత్రీకరించారు. అలాగే పది రోజులు పాటు వారణాసి, ఢిల్లీ, డెహ్రాడూన్ వంటి నార్త్ ఇండియన్ ప్రాంతాల్లోనే షూటింగ్ జరపుకుందని బ్రహ్మోత్సవం యూనిట్ సభ్యులు చెబుతున్నారు.


  నిజమా

  నిజమా

  ఈ సినిమాలో మహేష్ ద్విపాత్రాభియం చేస్తూ కనపడనున్నారని సమాచారం. అయితే ఈ ఇద్దరు మహేష్‌లు మురించినున్నది తండ్రీ కొడుకులుగానా, అన్నదమ్ములుగానా అన్నది ప్రస్తుతానికి ప్రశ్నే. పైవేవీ కావన్నట్టు అదేదో ప్రత్యేకం అని చెప్పి కొన్ని సెకెన్లకో, నిమిషాలకో పరిమితమయినా చేసేదేం లేదు.


  ప్రిన్స్ ప్రభంజనం

  ప్రిన్స్ ప్రభంజనం

  దక్షిణాది సెలబ్రేటీల హోదాను జాతీయ వ్యాప్తంగా చాటడంలో ప్రిన్స్ మహేష్ బాబుకు మరొకరు సాటిలేరు అనే విధంగా ప్రిన్స్ ప్రభంజనం కొనసాగుతోంది.  ఆరవస్దానం

  ఆరవస్దానం

  'మోస్ట్ డిజైరబుల్ మ్యాన్' పేరుతో జాతీయ వ్యాప్తంగా ఎంపిక చేసిన జాబితాలో మన టాలీవుడ్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు 6వ స్థానాన్ని దక్కించుకున్నాడు. గత ఏడాది కూడా ప్రిన్స్ ఇదే స్థానంలో నిలవడం విశేషం.  మహేష్ మాట్లాడుతూ..

  మహేష్ మాట్లాడుతూ..

  "బ్రహ్మోత్సవం" కధ కుటుంబ ప్రధానంగా సాగుతుందని, అన్ని తరాలకు చెందిన జనాల మధ్య సంబంధాలు ఎలా ఉంటాయో అన్న దానికి నిదర్శనంగా నిలుస్తుందని అన్నారు.  మహేష్ కంటిన్యూ చేస్తూ..

  మహేష్ కంటిన్యూ చేస్తూ..

  ఈ సినిమాలో రోల్ గురించి 'ఛాలెంజింగ్' అనే పదం తప్పని, కధ వినే సమయంలో తనకు 'ఎక్సైట్ మెంట్'గా అనిపించాలని, 'బ్రహ్మోత్సవం' సినిమాలో పాత్ర ఇప్పటివరకు నేను పోషించనిదని చెప్పారు ప్రిన్స్.


  రిలీజ్ రోజే

  రిలీజ్ రోజే

  ఈ సినిమా విడుదల తేదీని మాత్రం ఆడియో రిలీజ్ రోజున ప్రకటిస్తారని మహేష్ తెలిపారు.


  మరో హైలెట్

  మరో హైలెట్

  "బ్రహ్మోత్సవం" సినిమాలో హీరో ప్రిన్స్ మహేష్ బాబు కాకుండా మరో అంశం హైలైట్ అవుతోంది. అదే ఈ సినిమా నిర్మాణ సంస్థ అయిన పివిపి. ఇటీవల కాలంలో మంచి 'కాన్సెప్ట్'లతో సినిమాలను నిర్మిస్తూ ప్రేక్షకులకు కొత్తదనాన్ని అందిస్తోంది.


  భయపడుతున్నా

  భయపడుతున్నా

  ఇటీవల కాలంలో పెద్ద హీరోల సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద వరుసగా బోల్తా కొట్టడంతో. 'బ్రహ్మోత్సవం' ఫలితం ఏమవుతుందా. అని ప్రిన్స్ ఫ్యాన్స్ కూడా కాస్త ఆందోళనగా ఉన్నారు


  మెరిసిపోతున్నాడు

  మెరిసిపోతున్నాడు

  సింపుల్ చెక్స్ షర్టుతో, కలర్ ఫుల్ పోస్టర్ తో మహేష్ మెరిసిపోతున్నాడు. ప్రతి సన్నివేశం ఒక ఉత్సవంలా ఉంటుందని చెప్పిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల మాటలకు అనుగుణంగా "బ్రహ్మోత్సవం" పోస్టర్లు దర్శనమిస్తున్నాయి.


  అదే బ్రహ్మోత్సవం

  అదే బ్రహ్మోత్సవం

  స్వచ్ఛమైన మనసున్న నలుగురు వ్యక్తులు ఒకచోట చేరితే అక్కడ ఓ ఉత్సవశోభ కనిపిస్తుంది. అలాంటి నాలుగు కుటుంబాలు కలిసి ప్రతి సందర్భాన్ని ఓ ఉత్సవంలా జరుపుకుంటే అదే బ్రహ్మోత్సవం అన్నారు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల.


  ఇదో సస్పెన్స్

  ఇదో సస్పెన్స్

  ఉగాది రోజున విడుదల చేసిన బ్రహ్మోత్సవం పోస్టర్ లో కనిపించని ఓ వ్యక్తికి మహేష్‌బాబు పాదరక్షల్ని అందిస్తుండటం అందరిలోనూ ఆసక్తిని కలిగించింది. మహేష్‌బాబు పాదరక్షలు అందిస్తున్న వ్యక్తి ఎవరు? సినిమాలో అతనికి మహేష్‌కు ఉన్న అనుబంధమేమిటి? అనేది తెలియాలంటే ఈ సినిమా విడుదల వరకు వేచిచూడాల్సిందే.


  స్పెషల్ గా..

  స్పెషల్ గా..

  సినిమాల్లో హీరోల పాత్ర చిత్రణ, గెటప్‌లతో పాటు వారు వాడే బైక్‌లను ప్రత్యేకంగా డిజైన్ చేయడం ఓ ట్రెండ్‌గా మారింది. ఆ కోవలోనే మహేష్‌బాబు బ్రహ్మోత్సవం కోసం వర్ణశోభితమైన బ్రహ్మోత్సవరథాన్ని ప్రత్యేకంగా సిద్ధం చేశారు. వినూత్నంగా డిజైన్ చేసిన ఈ బైక్ ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.


  నిజమేనా

  నిజమేనా

  మే 7న హైదరాబాద్ లో 'బ్రహ్మోత్సవం' ఆడియో వేడుకను ఘనంగా నిర్వహించేందుకు చిత్రబృందం ప్లాన్ చేసినట్లు సమాచారమ్. ఈ ఆడియో వేడుకలో నాగ్ ముఖ్య అతిథిగా పాల్గొననున్నాడు.


  తెర ముందు

  తెర ముందు

  సూపర్‌స్టార్‌ మహేష్‌ సరసన సమంత, కాజల్‌ అగర్వాల్‌, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్‌, జయసుధ, రేవతి, నరేష్‌, రావు రమేష్‌, తనికెళ్ళ భరణి, శుభలేఖ సుధాకర్‌, తులసి, ఈశ్వరీరావు, షాయాజీ షిండే, కృష్ణభగవాన్‌, రజిత, కాదంబరి కిరణ్‌, చాందిని చౌదరి తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.


  తెరవెనక

  తెరవెనక

  ఈ చిత్రానికి డైరెక్టర్‌ ఆఫ్‌ ఫోటోగ్రఫీ: ఆర్‌.రత్నవేలు, సంగీతం: మిక్కీ జె. మేయర్‌, డాన్స్‌: రాజుసుందరం, ప్రొడక్షన్‌ డిజైనర్‌: తోట తరణి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: సందీప్‌ గుణ్ణం, నిర్మాతలు: పెరల్‌ వి.పొట్లూరి, పరమ్‌ వి.పొట్లూరి, కవిన్‌ అన్నె, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీకాంత్‌ అడ్డాల.


  English summary
  Mahesh Babu's Brahmotsavam was initially edited for 2hrs 35mnts but makers have decided to remove two songs to make the screenplay look tight and crisp.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more