»   » మహేష్, త్రివిక్రమ్ 'కలేజా' ఎప్పుడు చూస్తాం?

మహేష్, త్రివిక్రమ్ 'కలేజా' ఎప్పుడు చూస్తాం?

Posted By:
Subscribe to Filmibeat Telugu

మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతున్న 'కలేజా' చిత్రం ఏప్రిల్ 9 విడుదల చేసేందుకు ప్లాన్ చేసినట్లు సమాచారం. సురేంద్రరెడ్డితో చేసిన 'అతిథి' చిత్రం తర్వాత ఇంతవరకూ మహేష్ బాబు సినిమా ఒక్కటీ విడుదల కాలేదు. అలాగే ఇంతకుముందు ఇదే కాంబినేషన్ లో అతడు చిత్రం వచ్చి విజయవంతం అయ్యింది. దాంతో 'కలేజా' చిత్రం పై విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఇంతవరకూ 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తదుపరి షెడ్యూల్ హైద్రాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో మార్చి నుంచి ప్రారంభమవుతుంది. ఈ షెడ్యూల్ తో షూటింగ్ పూర్తవుతుంది. ఇక యాక్షన్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్నారని చెప్తున్నారు. శింగనమల రమేష్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మహేష్ కు జోడిగా అనుష్క నటిస్తోంది. అలాగే ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu