»   » నష్టాలలో స్పైడర్‌ నేషనల్ రికార్డు? .. బొక్క పడేది తెలిస్తే షాకే..

నష్టాలలో స్పైడర్‌ నేషనల్ రికార్డు? .. బొక్క పడేది తెలిస్తే షాకే..

Posted By:
Subscribe to Filmibeat Telugu
"Spyder" Registered Average Collections In Overseas Box Office

ప్రిన్స్, మహేశ్ బాబు, దర్శకుడు మురుగదాస్ కాంబినేషన్‌లో వచ్చిన స్పైడర్ చిత్రం కలెక్షన్లు సినీ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. 125 కోట్ల వ్యయంతో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను చేరుకోలేకపోయింది. మహేశ్ తొలిసారి తమిళ సినీ పరిశ్రమలో ఎంట్రీ ఇస్తున్నారనే కారణంతో నిర్మాతలు కూడా భారీగానే బడ్జెట్‌ను గుప్పించారు. చిత్ర విడుదలకు ముందు మంచి హైప్ రావడంతో డిస్టిబ్యూటర్లు ఎగబడి కొనుగోలు చేశారు. తీరా రిలీజ్ తర్వాత స్పైడర్ చిత్రం పంపిణీదారులకు చుక్కలు చూపిస్తున్నదట.

భారీగా పడిపోయిన కలెక్షన్లు

భారీగా పడిపోయిన కలెక్షన్లు

భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన స్పైడర్ తొలి ఆట నుంచే డివైడ్ టాక్ తెచ్చుకొన్నది. ఆ తర్వాత ఈ చిత్రంపై పూర్తిగా ప్రేక్షకులు పెదవి విరిచారు. తొలి రెండు రోజుల కలెక్షన్లు ఊరించినా ఆ తర్వాత చప్పుున పడిపోయాయి.

45 కోట్ల షేర్ మాత్రమేనట..

45 కోట్ల షేర్ మాత్రమేనట..

తొలి వారాంతంలో స్పైడర్ చిత్రం సుమారు 45 కోట్ల షేర్ వసూలు చేసినట్టు ట్రేడ్ అనలిస్టులు పేర్కొంటున్నారు. రెండు, మూడో వారాంతానికి మరో 10 కోట్ల లోపే ఉండే అవకాశముందని వెల్లడిస్తున్నారు.

స్పైడర్ రిలీజ్ తర్వాత

స్పైడర్ రిలీజ్ తర్వాత

స్పైడర్ రిలీజ్ తర్వాత ఐదురోజులలోపే 70 శాతం పెట్టుబడి డిస్టిబ్యూటర్లకు వస్తుంది అని అందరూ ఆశించారు. సోమవారం నాటి కలెక్షన్లు చాలా దారుణంగా ఉన్నట్టు జాతీయ పత్రికలు కథనాలు వెలువడ్డాయి. తాజాగా అందుబాటులో ఉన్న 6 రోజుల గ్లోబల్ కలెక్షన్ల వివరాలు ఇలా ఉన్నాయి. అమెరికాలో 9.60 కోట్లు, ఆస్ట్రేలియాలో 96 లక్షలు, మలేషియాలో 53 లక్షలు, యూకేలో 23 లక్షలు వసూలు చేసినట్టు సమాచారం.

రూ.124 కోట్ల మేరకు

రూ.124 కోట్ల మేరకు

రిలీజ్‌కు ముందు స్పైడర్ థియేటర్ హక్కులకు సంబంధించిన బిజినెస్ సుమారు రూ.124 కోట్ల మేరకు జరిగిందనేది సమాచారం. ఓవరాల్‌గా కలెక్షన్లు 55 మించి ఉండబోవన్నది ట్రేడ్ అనలిస్టుల విశ్లేషణ.

దాదాపు 70 కోట్ల మేర

దాదాపు 70 కోట్ల మేర

స్పైడర్ వసూళ్లను బట్టి చూస్తే స్పైడర్‌తో పంపిణీదారులకు పెద్ద బొక్కే పడే అవకాశం ఉంది. అంటే దాదాపు 70 కోట్ల మేర నష్టం రావడానికి ఆస్కారం ఉంది. ఈ నష్టం జాతీయ స్థాయిలో వేళ్ల మీద లెక్కపెట్టే విధంగా ఉంటుందని అంటున్నారు.

రికార్డు స్థాయి నష్టాలు

రికార్డు స్థాయి నష్టాలు

భారీ బడ్జెట్‌తో రూపొంది జాతీయ స్థాయిలో ఇప్పటి వరకు భారీ ఫ్లాపులుగా నిలిచిన వాటిలో మొహెంజదారో, బాంబే వెల్వెట్ చిత్రాలు ఉన్నాయి. వాటి సరసన స్పైడర్ నిలిస్తే ఇండియన్ సినీ హిస్టరీలోనే అతి పెద్ద డిజాస్టర్లలో ఒకటని చెప్పవచ్చు.

English summary
Mahesh Babu, Rakul Preet and SJ Suryah starrer 'Spyder', directed by AR Murugadoss, released on September 27, 2017 in India to packed screens.The bilingual movie has reportedly registered average collections in the overseas box office ever since its release. The movie has been officially been termed as a 'disaster' in the international markets by trade experts.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu