»   » మహేష్, మురగదాస్ చిత్రం టీజర్ గురించి ఆశ్చర్యపోయే వార్త

మహేష్, మురగదాస్ చిత్రం టీజర్ గురించి ఆశ్చర్యపోయే వార్త

Posted By:
Subscribe to Filmibeat Telugu
దరాబాద్ : మహేష్‌బాబు హీరోగా మురుగదాస్‌ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఎన్వీప్రసాద్‌, ఠాగూర్‌ మధు సంయుక్తంగా తెలుగుతో పాటు తమిళంలోనూ నిర్మిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా సాగుతోంది.


'బ్రహ్మోత్సవం' వంటి డిజాస్టర్ చిత్రం తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు కొంత గ్యాప్ తీసుకుని చేస్తున్న చిత్రం కావటంతో ఈ సినిమాతో ఎలాగైనా సూపర్ హిట్ కొట్టాలని దర్శక,నిర్మాతలు, హీరో పరిశ్రమిస్తున్నారు.

దానికి తోడు ఈ సినిమాని అనౌన్స్ చేసినప్పటి నుండి అభిమానుల్లో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అవుతూ వచ్చాయి. ఈ నేపధ్యంలో ప్రతీ విషయంలోనూ ఆచి,తూచి అడుగులు వేస్తోంది టీమ్. ఓ స్ట్రాటజీగా .. చిత్రం మొదలై ఇన్నాళ్లు కావొస్తున్నా టీమ్ ఫస్ట్ లుక్, టీజర్ కనీసం టైటిల్ ఏమిటనేది కూడా రివీల్ చేయకుండా ఫ్యాన్స్ ను వెయిట్ చేయిస్తూ వస్తున్నారు. ఒక్కసారిగా బాంబ్ పేల్చినట్లుగా అద్బుతం చేయాలని వాళ్ల ప్లాన్ అని తెలుస్తోంది.

Mahesh Babu’s teaser being made in UK

అలాంటి అద్బుతం జరిగాలంటే సినిమాకు సంభందించి బయిటకు వచ్చే టీజర్ మామూలుగా ఉండకూడదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని దర్శకుడు మురుగదాస్ చిత్ర టీజర్ ను భారీ గ్రాఫికల్ వర్క్ తో, హై క్వాలిటీలో ఉండేలా రూపొందిస్తున్నారట. అది కూడా యూకేలో చేస్తున్నారని సమాచారం.

దాదాపు 30 సెకన్ల నిడివి ఉండే ఈ టీజర్ ద్వారా సినిమా స్టోరీ లైన్ ఏమిటనేది చెప్తారట. ఇకపోతే మహేష్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా నటించనున్న ఈ చిత్రం కొత్త షెడ్యూల్ రేపటి నుండి ముంబైలో మొదలుకాననుంది.

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం...జూన్‌ 23న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు అలాగే భగవద్గీతలో 'సంభవామి యుగే యుగే' అనేది ప్రముఖ శ్లోకం. దీన్ని ఇప్పుడు మహేష్‌ బాబు సినిమాకు టైటిల్‌గా ఖరారు చేయబోతున్నారని తెలిసింది. ఇప్పటి వరకూ ఎటువంటి టైటిల్‌ పెట్టకుండానే చిత్రీకరణ కానిచ్చేస్తున్నారు. కనీసం సినిమాలో మహేష్‌ ఎలా ఉంటాడో కూడా వెల్లడించకుండా రహస్యం ఉంచారు.

టెర్రరిస్టులతో పోరాడే ఇంటిలిజెన్స్ ఆఫీసర్‌గా కనిపించబోతున్న మహేష్‌కు ముందు 'ఏజెంట్‌ శివ', 'వాస్కో డ గామా' అనే టైటిల్‌ పెడతారని అంతా ప్రచారమైంది. కానీ ఆ చిత్ర నిర్మాణ సంస్థ 'శంభవామి' అనే టైటిల్‌ను రిజిస్టర్‌ చేయించింది.

తెలుగు, తమిళ్‌లో ఒకేసారి రూపొందుతోన్న ఈ సినిమా లో ఎస్‌.జె.సూర్య, భరత్‌ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకి సంగీతం: హారిస్‌ జైరాజ్‌, ఛాయాగ్రహణం: సంతోష్‌ శివన్‌

English summary
Mahesh Babu Upcoming prestigious action thriller Movie is directed A R Muragadoss, N V Prasad and Tagore Madhu are the producers of the film. Meanwhile, the makers are planning to release a promotional teaser in a few days.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu