»   » శ్రీను వైట్ల, మహేష్ కాంబినేషన్ టైటిల్ ఏంటి?

శ్రీను వైట్ల, మహేష్ కాంబినేషన్ టైటిల్ ఏంటి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

మహేష్, శ్రీను వైట్ల కాంబినేషన్లో ప్రారంభం కానున్న చిత్రానికి 'పవర్' అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. శ్రీను వైట్ల స్వయంగా కథ అందిస్తున్న ఈ చిత్రానికి కోనవెంకట్ డైలాగులు అందిస్తున్నారు. సమంత హీరోయిన్ గా చేస్తోంది. జూన్ 15 తేదీ నుంచీ ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. అలాగే ఈ చిత్రాన్ని ఎ టీవీ..అనీల్ సుంకర నిర్మిచనున్నారు. అనీల్ సుంకర ఇంతకుముందు వెంకటేష్ హీరోగా నమో వెంకటేశ, మంచు మనోజ్ తో బిందాస్ చిత్రాలు రూపొందించిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం మహేష్..త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం కోసం పూనే దగ్గరలో గల విలేజ్ లో ఉన్నారు. అనూష్క హీరోయిన్ గా చేస్తున్న ఆ చిత్రంలో మహేష్..టాక్సీ డ్రైవర్ గా కనపడనున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu