»   » మహేష్ బాబు కొత్త సినిమా...కొత్త ఇల్లు

మహేష్ బాబు కొత్త సినిమా...కొత్త ఇల్లు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రస్తుతం హైదరాబాద్‌లోని జర్నలిస్ట్స్ కాలనీలో ఉ౦టున్న ప్రిన్స్ మహేష్ బాబు త్వరలో కొత్త ఇంటిలోకి గృహ ప్రవేశం చేస్తున్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నె౦.81లో కడుతున్న కొత్త ఇల్లు కడుతున్న అక్టోబర్‌కల్లా పూర్తవుతు౦ది. దాంతో మంచి మూహూర్తం చూసి కొత్తి౦ట్లోకి కాపురం మార్చబోతున్నారు. ఇక ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో కలేజా అనే చిత్రం చేస్తున్నారు. అనూష్క ఈ చిత్రంలో హీరోయిన్ గా చేస్తోంది. అలాగే ఈ చిత్రం ఆర్ధిక కారణాలతో ఆగినట్లు వార్తలు వినపడుతున్నాయి. సురేంద్రరెడ్డి తో చేసిన అతిధి అనంతరం మహేష్ మరో చిత్రం చేయలేదు. అలాగే త్రివిక్రమ్ చిత్రం అనంతరం శ్రీను వైట్ల దర్శకత్వంలో మరో చిత్రం కమిటయ్యారు. ఈ చిత్రంలో మహేష్ సరసన సమంతా చేస్తోంది. సమంతా...గౌతం మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఏ మాయ చేసావే చిత్రం ద్వారా పరిచయం అయింది. అందులో నాగచైతన్య హీరోగా చేసారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu