»   » కొరటాల శివకు మహేష్ బాబు షాక్

కొరటాల శివకు మహేష్ బాబు షాక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రచయిత నుంచి దర్శకుడు గా మారిన కొరటాల శివ ఇప్పుడు అగ్ని పరీక్ష ఎదుర్కొంటున్నాడు. ఇన్నాళ్లూ రచయిత సీట్ లో కూర్చుని కథలు చెప్పి ఒప్పించిన ఆయన ఇప్పుడు హీరోలతో ఇబ్బంది పడుతున్నాడని పిల్మ్ నగర్ టాక్. మిర్చి చిత్రంతో ఘన విజయం సాధించినా ఆయన చిత్రం ఏదీ మొదలుకాలేదు. ఆయన వద్ద ఫుల్ బైండ్ స్క్రిప్టు ఉన్నా..హీరోల డేట్స్ సంపాదించటం గగనమైతోందని వాపోతున్నట్లు చెప్పుకుంటున్నారు. రామ్ చరణ్ తో మొదట ప్రాజెక్టుని అనుకున్నా అది టర్న్ తిరిగి కృష్ణ వంశీ చేతికి వెళ్లింది.

Mahesh Babu shocks Koratala Siva

దాంతో కొరటాల శివ ...ఈ సారి ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లారు. అయితే అక్కడ ఎన్టీఆర్ చెప్పిన మార్పులే చేయకపోవటంతో ఆయన కోప్పడినట్లు సమాచారం. అయితే ఈ లోగా మహేష్ కథ వినటాననటంతో అటు అడుగు వేసారు. అగడు చిత్రం తర్వాత ఈ ప్రాజెక్టు ఉంటుందనుకున్నారు. కొరటాల శివ దానిపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. కానీ మహేష్ నుంచి షాక్ కొట్టే వార్త వచ్చిందని సమాచారం.


మహేష్ బాబు ఇప్పుడు మిగతా ప్రాజెక్టులు అన్నీ ప్రక్కన పెట్టి అశ్వనీదత్ తో ముందుకు వెళ్లే ఆలోచనలో ఉన్నారు. ఈ మేరకు ఆయన బాలీవుడ్ దర్శక ద్వయం రాజ్, డికె ల స్క్రిప్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆగడు తర్వాత ఇమ్మీడియట్ గా ఆ చిత్రమే మొదలవుతుంది. దాంతో కొరటాల శివ దాదాపు సంవత్సరం పాటు వెయిట్ చేయాల్సిన పరిస్ధితి . సంవత్సరంలో ఎన్ని లెక్కలు మారి..ఏం జరుగుతుందో అని ఇండస్ట్రి వర్గాలు అంటున్నాయి.

English summary

 
 Writer turned director Koratala Shiva has delivered one of the biggest hits of the year with Mirchi. Koratala Shiva is happy to wait until Mahesh Babu gets free. He was supposed to direct Mahesh Babu's immediate film after Aagadu. When Koratala has pinned lot of hopes on that project, he gets a rude shock from Mahesh Babu. Superstar has suddenly brought in Aswini Dutt's project ahead of all other commitments.
Please Wait while comments are loading...