»   » నానితో హిట్ కొడితే ఆమెకు మహేష్ డేట్స్ ఇస్తాడు ఖచ్చితంగా

నానితో హిట్ కొడితే ఆమెకు మహేష్ డేట్స్ ఇస్తాడు ఖచ్చితంగా

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సూపర్ స్టార్ కృష్ణ కుమార్తె మంజుల హీరోయిన్ గా తన తమ్ముడు మహేష్ బాబుతో 'నాని", 'పోకిరి" రెండు చిత్రాలు నిర్మించారు. ఆమె నటి కూడాను. అయితే నటిగా,నిర్మాతగా మనకు తెలిసిన ఆమె త్వరలో మెగాఫోన్ పట్టి, తనలోని దర్శకురాలిని కూడా ఆవిష్కరించబోతోంది.

రైటే..మరీ చదివింది కరెక్టే... నాని హీరోగా ఓ చిత్రాన్ని తెరకెక్కించేందుకు మంజుల సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌ సంస్థ ఆ చిత్రాన్ని నిర్మించనున్నట్టు తెలుస్తోంది. అయితే నానితో హిట్ కొట్టాక ఆమె నెక్ట్స్ టార్గెట్ తన సోదరుడు మహేష్ బాబు అంటున్నారు సినిమా జనం.

Mahesh babu sister Manjula directs Nani

మొదట మహేష్ కే ఆమె కథ చెప్తే...తొలిగా ఓ సినిమా డైరక్ట్ చేసి, హిట్ కొట్టి చూపించు, అప్పుడు ఖచ్చితంగా మహేష్ డేట్స్ ఇస్తాను అన్నాడని ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు. అందులో భాగంగానే ఆమె నానితో మొదట సినిమా చేసి, అద్బుతమనిపించుకుని, ఆ తర్వాత మహేష్ తో సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

నిర్మాతగా... దర్శకుడు పూరి జగన్నాధ్ తో కలిసి మంజుల సంయుక్తంగా నిర్మించిన 'పోకిరి" ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత 'కావ్యాస్ డైరీ"..తాజాగా 'ఏమాయ చేసావె" చిత్రాలు నిర్మించి నిర్మాతగా తన సత్తా ఏమిటో నిరూపించుకున్న మంజుల.. రెట్టించిన ఉత్సాహంతో తన తమ్ముడు మహేష్ బాబుతో మరో చిత్రాన్ని దర్శక,నిర్మాతగా చేయటానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. నానితో ఆమె చేయబోయే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశాలున్నాయి.

English summary
Now Manjula is all set to wield megaphone now. Gemini Kiran will be producing the film under Anandi Arts Banner.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu