Just In
- 13 min ago
‘క్రాక్’ తర్వాత నందమూరి బాలకృష్ణతో సినిమా: క్లారిటీ ఇచ్చిన గోపీచంద్ మలినేని
- 58 min ago
నాని హీరోయిన్.. మొత్తానికి పెద్ద హీరోనే పట్టేసింది
- 1 hr ago
రాగిణి ద్వివేదికి మోక్షం.. ఎట్టకేలకు బెయిల్ మంజూరు
- 1 hr ago
ప్రభాస్ సినిమా సీక్రెట్స్ లీక్ చేసిన కృష్ణం రాజు: రిలీజ్ డేట్.. క్యారెక్టర్స్ ఇలా అన్నీ బయట పెట్టారు!
Don't Miss!
- News
Capital Gains Tax అంటే ఏంటి..? బడ్జెట్ వేళ పూర్తి వివరాలు మీకోసం..!
- Lifestyle
డయాబెటిస్ ఉన్నప్పటికీ సుదీర్ఘకాలం మరియు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి ఇక్కడ కొన్ని ముఖ్యమైన చిట్కాలు ఉన్నాయ
- Finance
ఫ్యూచర్ గ్రూప్ డీల్, అమెజాన్‌కు షాక్: రిలయన్స్‌కు గుడ్‌న్యూస్, షేర్ జంప్
- Sports
IPL 2021లో అత్యధిక ధర అతనికే.. ఎవరూ ఊహించరు కూడా!!
- Automobiles
భారత్‌లో అడుగుపెట్టిన కొత్త బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్; ధర & వివరాలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మహేశ్ - రాజమౌళి ప్రాజెక్ట్ మొదలయ్యేది అప్పుడే: ఈ గ్యాప్‌లో ఎన్ని సినిమాలు వస్తాయంటే!
తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూసిన కాంబినేషన్లలో దర్శకధీరుడు రాజమౌళి - సూపర్ స్టార్ మహేశ్ బాబు కలయిక ఒకటి. ఎప్పుడో వీళ్లిద్దరి కాంబోలో సినిమా వస్తుందని అనుకున్నా.. అది సాధ్యం కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో గత ఏడాది మహేశ్‌తో సినిమా చేయబోతున్నట్లు ప్రకటించాడు జక్కన్న. దీంతో ఈ సినిమా విషయంలో ఎన్నో ఊహాగానాలు కూడా ప్రచారం అయిపోయాయి. ఈ నేపథ్యంలో అసలు ఈ ప్రాజెక్టు ఎప్పుడు పట్టాలెక్కుతుందన్న దానిపై ఎటువంటి ప్రకటనా వెలువడలేదు. కానీ, దీని గురించి తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. రాజమౌళి - మహేశ్ బాబు కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా 2023లో ప్రారంభం అవుతుందట. అప్పటి నుంచి రెండేళ్ల పాటు ఈ మూవీ తెరకెక్కనుందని తెలుస్తోంది. అంటే 2025లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేసుకున్నట్లు వినికిడి. అందుకే ఈ గ్యాప్‌లో సూపర్ స్టార్ వీలైనన్ని ఎక్కువ చిత్రాలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' అనే సినిమా చేస్తున్నాడు. జనవరి మూడో వారం నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.

ఇది పట్టాలెక్కక ముందే మహేశ్ బాబు.. వంశీ పైడిపల్లితో సినిమాకు కమిట్ అయ్యాడని వార్తలు వస్తున్నాయి. ఇందుకోసం వీళ్లిద్దరూ ఇప్పటికే పలుమార్లు చర్చలు కూడా జరిపారని తెలిసింది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడక ముందే.. సూపర్ స్టార్.. యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుములకూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. రాజమౌళి సినిమాకు ముందే ఈ మూడు చిత్రాలను పూర్తి చేయాలని మహేశ్ భావిస్తున్నాడట. మరోవైపు, జక్కన్న ప్రస్తుతం RRR అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలయికలో రాబోతున్న ఈ చిత్రం.. ఈ ఏడాది చివర్లో విడుదల కానుందని ప్రచారం జరుగుతోంది.