»   » నొప్పి లేకుంటే మహేష్..డబ్బిగ్ పూర్తి చేసేవాడే

నొప్పి లేకుంటే మహేష్..డబ్బిగ్ పూర్తి చేసేవాడే

Posted By:
Subscribe to Filmibeat Telugu

మహేష్ బాబు తాజా చిత్రం “ఖలేజా" కి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు స్పీడుగా జరుగుతున్నాయి. మరో ప్రక్క మహేష్‌బాబు డబ్బింగ్ మాత్రం పూర్తి కావటం లేదు. తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ పనులు మాత్రం మందకొడిగా సాగుతున్నాయి. దానికి కారణం...మహేష్ గత కొద్ది రోజులుగా గొంతునొప్పితో బాధపడుతుండటం అని తెలుస్తోంది. అందుకే ఎప్పుడో డబ్బింగ్ పూర్తవ్వాల్సి ఉండగా, ఆ గొంతునొప్పి కారణంగానే డబ్బింగ్ చెప్పేటప్పుడు సరిగ్గా చెప్పలేకపోతుండటం వల్ల ఇన్ని రోజులుగా ఆలస్యమవుతోందని సమాచారం. మరొక పక్కన తను ఒప్పుకున్న బ్రాండ్ లకు అంబాసిడిర్ గా తిరుగుతూండే బిజీ షెడ్యూల్ కొంత లేటవటానకి కారణం అని తెలుస్తోంది. ఏదైమైనా ఒకటి రెండు రోజుల్లో తన వంతు డబ్బింగ్ మొత్తం పూర్తి చేయాలని గట్టి పట్టుదలతో ఉన్నట్లు తెలిసింది. ఇక డబ్బింగ్ పూర్తయిన వెంటనే సెన్సార్ కార్యక్రమాలు మొదలుపెట్టి అక్టోబరు 3 వరకు తొలి కాపీ సిద్ధం చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం..

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu