»   » ఫొటోల హడావిడి: ఫ్యాన్స్‌కు క్లాస్ తీసుకున్న మహేష్ బాబు

ఫొటోల హడావిడి: ఫ్యాన్స్‌కు క్లాస్ తీసుకున్న మహేష్ బాబు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఎప్పుడూ శాంతంగా ఉండే ప్రిన్స్ మహేష్ బాబుకు కూడా కోపం వచ్చింది. షూటింగ్ సమయంలో అత్యుత్సాహం ప్రదర్శించిన అభిమానులకు ఆయన క్లాస్ తీసుకున్నాడు. అభిమానుల హడావిడికి చాలా వరకు సహనం వహించిన చివరకు కాస్తా విసుక్కున్నట్లు చెబుతున్నారు. ఈ సంఘటన ఊటీలో జరిగింది.

మహేష్ బాబు నటిస్తున్న బ్రహ్మోత్సవం సినిమా షూటింగ్ ఊటీలో శరవేగంగా జరుగుతోంది. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ కొంత మంది అక్కడికి చేరుకున్నారు. తమ అభిమాన హీరోతో ఫొటోలు దిగాలని వారు ఆరాటపడ్డారు. ఎట్టకేలకు వాళ్ల కోరిక తీర్చేందుకు మహేష్ బాబు సిద్ధపడ్డారు.

Mahesh Babu takes class to Fans

తీరా మహిష్ ఫొటోలకు సిద్ధపడిన సమయంలో తమ వద్ద కెమెరాలు లేవని చెప్పారు. దాంతో షూటింగ్ స్పాట్‌లో ఉన్న కెమెరామన్‌ను పిలిపించి వాళ్లతో ఫొటోలు దిగి వాళ్లను సంతృప్తిపరిచాడు. అయితే, ఆ సమయంలో తమ సమయం వృధా కావడంతో మహేష్ బాబు అసహానికి గురయ్యారని చెబుతున్నారు.

తన కోసం ఇంత దూరం రావాల్సిన అవసరం ఏమి వచ్చిందని మహేష్ బాబు అభిమానులను మందలించాడని చెబుతున్నారు.

English summary
It is said that prince Mahesh babu has taken class to his fans at Ooti during Brahmotsavam shooting.
Please Wait while comments are loading...