»   »  శ్రీను వైట్లతో సెట్ చేసిన మహేష్

శ్రీను వైట్లతో సెట్ చేసిన మహేష్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్ బాబు, శ్రీను వైట్ల కాంబినేషన్ లో దూకుడు వంటి బ్లాక్ బస్టర్ చిత్రం వచ్చింది. ఆ వెంటనే ఆగడు వంటి డిజాస్టర్ ఇచ్చిన శ్రీను వైట్ల కు ఆ తర్వాత బ్రూస్ లీ వంటి మరో పెద్ద ఫ్లాప్ వచ్చింది. అయితే ఇప్పుడు ఆయన ఖాళీ పడ్డారు.

కానీ మహేష్ ప్రొడ్యూస్ చేయటానికి ముందుకు వచ్చారు. అయితే ఓ ట్విస్ట్. ఆ సినిమా తనతో కాదట. మహేష్ బాబు బావ సుధీర్ బాబు తో అని తెలుస్తోంది. మహేష్ కు కథ చెప్దామని వెళితే తన బావని నిలబెట్టడానికి ఓ కమర్షియల్ హిట్ కథతో సినిమా చేయమని మహేష్ అడిగాడని తెలుస్తోంది.

మహేష్ వంటి స్టార్ హీరో అడిగినప్పుడు కాదనకూడదని శ్రీను వైట్ల ...ఈ ప్రాజెక్టుని ఓకే చేసినట్లు సమచారం. ఈ సినిమాతో సుధీర్ బాబుకు లిప్ట్ ఇవ్వాలని మహేష్ బాబు ఫిక్స్ అయ్యారు. అందుకే ఈ సినిమాని తనే ప్రొడ్యూస్ చేస్తున్నట్లు చెప్తున్నారు.

Mahesh Babu to produce Sudheer Babu’s film?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, క్రేజీ డైరెక్టర్ శ్రీను వైట్ల మధ్య మంచి సాన్నిహిత్యం ఉండగా, వీరిద్దరి కాంబినేషన్‌లో మరో సినిమా తెరకెక్కనున్నట్టు తెలుస్తోంది. గతంలో దూకుడు ఆగడు అనే చిత్రాలు ఈ కాంబినేషన్‌లో తెరకెక్కాయి. అయితే ఈ సారి మాత్రం మహేష్ హీరోగా కాకుండా పూర్తి ప్రొడ్యూసర్‌గా మారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నట్టు తెలుస్తోంది. మహేష్

మహేష్ ఇంతకు ముందు శ్రీమంతుడు అనే చిత్రాన్ని తన సొంత ప్రొడకన్ అయిన జి. మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిచనున్నారు.

ఇక ఈ విషయం ఎలా బయిటకు వచ్చిందంటారా... సుధీర్ బాబు ఈ మధ్యనే ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలిపారు. మహేష్ నిర్మాణంలో సుధీర్ బాబు హీరోగా శ్రీను వైట్ల సినిమా తెరకెక్కుతుందనే విషయం తెలుసుకున్న ఆయన ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. చూస్తూంటే రాబోవు మూవీపై భారీ అంచనాలే ఉండేటట్లు ఉన్నారు.. మహేష్ ప్రస్తుతం బ్రహ్మోత్సవం చిత్రంతో బిజీగా ఉన్నారు.

English summary
Director Srinu Vaitla’s next is with Mahesh Babu’s brother in law Sudheer Babu and produced by MB Production house.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu