Just In
- 1 hr ago
శివరాత్రికి ‘శ్రీకారం’.. శర్వానంద్ సందడి అప్పుడే!
- 1 hr ago
ట్రెండింగ్ : బాగానే వాడుకుంటున్నారు.. గుండెపై పచ్చబొట్టు.. రాహుల్ మీదకు ఎక్కేసిన అషూ రెడ్డి
- 2 hrs ago
HBD Namrata.. ఐదేళ్లలో 29 హెల్త్ క్యాంప్స్.. అందుకే మహేష్ బాబుకు ఇంతటి క్రేజ్!
- 3 hrs ago
‘ఖిలాడీ’ అప్డేట్.. రవితేజ మరీ ఇంత ఫాస్ట్‌గా ఉన్నాడేంటి!
Don't Miss!
- News
జైలు నుంచి భూమా అఖిలప్రియ విడుదల, అన్నీ వివరాలు వెల్లడిస్తా.. సిటీ వదిలి వెళ్లొద్దు
- Sports
గాయపడ్డా.. బౌలింగ్ చేశా! అందుకు అదోక్కటే కారణం: సైనీ
- Finance
గోఎయిర్ బంపర్ ఆఫర్... అతి తక్కువ ధరకే విమాన టికెట్... ఇవీ వివరాలు...
- Lifestyle
మీరు దీన్ని తింటే, అన్ని వ్యాధులు A to Z మాయం అవుతాయి ...
- Automobiles
నిస్సాన్ మాగ్నైట్ అప్డేట్: 35,000కి పైగా బుకింగ్స్, 2 లక్షలకు పైగా ఎంక్వైరీస్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
RRR ఎఫెక్ట్: మహేశ్ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్.. చాలా ఏళ్ల తర్వాత సూపర్ స్టార్ ఇలా ఫిక్స్ అయ్యాడు.!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు దూకుడు మీదున్నాడు. కొన్నేళ్లుగా వరుస విజమాలను సాధిస్తున్న ఆయన.. గోల్డెన్ డేస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. అలాగే, హీరోల జాబితాలో టాప్ ప్లేస్‌పై కన్నేసిన సూపర్ స్టార్ అందుకు అనుగుణంగానే సినిమాలు ఒప్పుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో అతడు కీలక నిర్ణయం తీసుకున్నాడని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. ఇంతకీ ఏంటా నిర్ణయం.? వివరాల్లోకి వెళితే....

సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌తో కలిశాడు.. హ్యాట్రిక్ కొట్టేశాడు
సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇటీవల ‘సరిలేరు నీకెవ్వరు' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలో విజయశాంతి సహా పలువురు కీలక పాత్రలు చేశారు. ఈ మూవీ విజయంతో మహేశ్ ఖాతాలో హ్యాట్రిక్ నమోదైంది.

సరిలేరు అనిపించుకున్న మహేశ్.. రికార్డులు బద్దలు
సంక్రాంతి కానుకగా విడుదలైన ‘సరిలేరు నీకెవ్వరు' సూపర్ హిట్ అవడంతో పాటు కలెక్షన్ల పరంగానూ సత్తా చాటింది. ఈ మూవీ ఇప్పటి వరకు దాదాపు రూ. 120 కోట్ల పైచిలుకు వసూళ్లు సాధించింది. ఈ క్రమంలోనే తనకు ఎవరూ సరిలేరు అనిపించుకునేలా మహేశ్ బాబు పలు రికార్డులను సైతం బద్దలు కొట్టేశాడు. దీంతో చిత్ర నిర్మాతలు ఫుల్ ఖుషీగా ఉన్నారు.

ఎంజాయ్ చేస్తున్నాడా.? ఆస్పత్రిలో చేరుతున్నాడా.?
‘సరిలేరు నీకెవ్వరు' సూపర్ హిట్ అవడంతో మహేశ్ బాబు ఆనందంలో ఉన్నాడు. ఈ క్రమంలోనే అతడు తన కుటుంబంతో కలిసి అమెరికాలో ఎంజాయ్ చేస్తున్నాడు. సూపర్ ఫ్యామిలీ టూర్‌కు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు, మహేశ్ తన మోకాలికి సర్జరీ చేయించుకోవడం కోసమే అమెరికా వెళ్లాడని కూడా ప్రచారం జరుగుతోంది.

మళ్లీ అతడితో కలుస్తున్నాడు.. ఈ సారి కొంచెం కొత్తగా
సరిలేరు తర్వాత మహేశ్ బాబు.. తనకు ‘మహర్షి' వంటి సూపర్ హిట్ ఇచ్చిన వంశీ పైడిపల్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఈ విషయాన్ని దర్శకుడే స్వయంగా ప్రకటించాడు. ఇందులో మహేశ్ బాబు గ్యాంగ్‌స్టర్‌గా కనిపించబోతున్నాడని ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. అంతేకాదు, పర్యావరణాన్ని రక్షించాలనే ఓ మెసేజ్‌ను కూడా ఇవ్వబోతుందట ఈ సక్సెస్‌ఫుల్ జోడీ.

RRR ఎఫెక్ట్.. మహేశ్ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడు వంశీ పైడిపల్లి. ఈ సినిమా షూటింగ్‌ను ఏప్రిల్ నుంచి ప్రారంభిస్తారని, సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది విడుదల చేస్తారని ప్రచారం జరిగింది. అయితే, రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR సంక్రాంతికి రాబోతుండడంతో ఈ సినిమాను డిసెంబర్‌లోనే విడుదల చేయాలనుకుంటున్నట్లు తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది.

చాలా ఏళ్ల తర్వాత ఇలా ఫిక్స్ అయ్యాడు.!
మహేశ్ బాబు కెరీర్ ఆరంభంలో ఏడాదికి రెండు సినిమాలు చేసేవాడు. అయితే, స్టార్‌డమ్ వచ్చిన తర్వాత అతడు గ్యాప్ తీసుకుంటున్నాడు. అయితే, చివరిగా 2014లో అతడు రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆరేళ్ల తర్వాత అంటే ఈ ఏడాది మరోసారి సూపర్ స్టార్ రెండు సినిమాలతో వస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. దీంతో మహేశ్ ఫ్యాన్స్ సంబర పడిపోతున్నారు.