తమన్‌పై మహేష్‌బాబు సీరియస్
సినిమాల్లో తప్ప..నిజ జీవితంలో మహేష్ ముఖంలో కోపం అనేది కనిపించదు. ఏ కార్య్రక్రమానికి వచ్చినా చాలా కూల్ గా కనిపిస్తుంటాడు ప్రిన్స్. వాస్తవానికి మహేష్ మనస్తత్వమే అంత. అలాంటి కూల్ హీరోకు కోపం తెప్పించాడు మ్యూజిక్ డైరెక్టర్ తమన్. ఇటీవల దూకుడు సినిమాకు సంగీతం అందించిన తమన్....మహేష్ బాబు అభిమానుల మెప్పు పొందక పోవడమే ఇందుకు కారణం.
దూకుడు సినిమాకు తమన్ అందించిన పాటలు యావరేజ్ గా ఉండటమే ఇందుకు కారణం. 'ఇటు రాయే" పాటతో పాటు ఐటం సాంగు మినహా....మిగిలిన పాటలేవీ అభిమానులకు నచ్చలేదు. అభిమానుల నుంచే కాదు మామూలు జనాల నుంచి కూడా ఇదే వాదన వినిపిస్తుంది. ఆడియో రిలీజ్ అయిన తర్వారా మహేష్ కు ఫ్యాన్స్ నుంచి, సన్నిహితుల నుంచి ఫోన్ల మీద ఫోన్లు. అందులో ఏ ఒక్కరు కూడా అన్ని పాటలు బాగా ఉన్నాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేదట. తమన్ అందించిన సంగీతం తమ అంచనాలను ఏమాత్రం అందుకోలేక పోయిందని ప్రతి ఒక్కరు విమర్శించడంతో.....మహేష్ బాబుకు కోపం ముంచుకొచ్చింది. దీంతో వెంటనే తమన్ కు ఫోన్ చేసి క్లాస్ పీకినట్లు తెలుస్తూంది. కనీసం బిజినెస్ మ్యాన్ సినిమాకైనా ఇలాంటి కంప్లయింట్ రాకుండా అభిమానులకు నచ్చే విధంగా మంచి ట్యూన్స్ అందించాలని వార్నింగ్ ఇచ్చినట్లు మహేష్ సన్నిహితుల గుసగుస.


Click it and Unblock the Notifications











