»   » ఎన్టీఆర్ కు మహేష్ ఫొన్ చేసి మరీ...

ఎన్టీఆర్ కు మహేష్ ఫొన్ చేసి మరీ...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు సుకుమార్ డైరక్షన్ లో ఎన్టీఆర్ నటించిన ‘నాన్నకు ప్రేమతో' చిత్రం ట్రైలర్‌కు ఓ రేంజిలో రెస్పాన్స్ వస్తూన్న సంగతి తెలిసిందే. గతంలో ఇంతకుముందెన్నడూ చూడని వెరైటి గెటప్‌లో కనిపిస్తున్న ఎన్టీఆర్‌ను చూసి ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో ఈ ట్రైలర్ ని చూసిన మహేష్ సైతం ఫోన్ చేసి మరీ మెచ్చుకున్నట్లు సమాచారం. ఈ ట్రైలర్ చూసిన మహేష్ ...ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుందని చెప్పినట్లు తెలుస్తోంది.

మహేష్ తో నాన్నకు ప్రేమతో దర్శకుడు ఇంతకు ముందు సంక్రాంతికి వన్ నేనొక్కడినే అంటూ చిత్రం చేసారు. ఆ చిత్రం భాక్సాఫీస్ వద్ద ఫెయిలైనా క్రిటికల్ గా మంచి మార్కులే వేయించుకుంది. ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్ తో ఈ చిత్రాన్ని సుకుమార్ చేస్తున్నారు. ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి.

ఇక నిమిషం 29 సెకన్ల ట్రైలర్‌కు అద్బుతమైన రెస్పాన్స్‌ వస్తోంది. ఇప్పటికే యుట్యూబ్‌లో 2 లక్షల 50వేలకుపైగా వ్యూస్ వచ్చాయి. ఎన్టీఆర్ 25వ సినిమా ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉండాలని రాజమౌళి కోరుకున్నట్లు తెలిపారు. ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌కు తండ్రిగా రాజేంద్రప్రసాద్ నటించగా....కీలక పాత్రలో జగపతిబాబు, అలాగే ఎన్టీఆర్‌కు బ్రదర్స్‌గా రాజీవ్ కనకాల, అవసరాల శ్రీనివాస్ నటించారు.

Mahesh Congratulates NTR on Phone

ఈ ట్రైలర్ చాలా బాగుందని అంటున్నారు చూసినవారంతా. ఎన్టీఆర్ మరోసారి తన స్కిల్స్ తో మైమరించాడనే చెప్పాలి. అలాగే అతని స్టైలిష్ హెయిర్ స్టైల్, గడ్డం స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి. అలాగే ఈ చిత్రంలో విలన్ గా నెగిటివ్ రోల్ లో కనిపించిన జగపతిబాబు కూడా చాలా కూల్ గా కనిపించటం గమనించవచ్చు. నిర్మాత మాట్లాడుతూ ''ఎన్టీఆర్‌ సినీ ప్రయాణానికీ, మా సంస్థకి ఎంతో ప్రతిష్ఠాత్మకమైన చిత్రమిది. '' అన్నారు.

ఎన్టీఆర్‌ సరసన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ భారీ చిత్రంలో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, రాజీవ్‌ కనకాల, అవసరాల శ్రీనివాస్‌, సితార, అమిత్‌, తాగుబోతు రమేష్‌, గిరి, నవీన్‌ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : దేవిశ్రీప్రసాద్‌, ఫోటోగ్రఫీ : విజరు చక్రవర్తి, ఆర్ట్‌ : రవీందర్‌, ఫైట్స్‌ : పీటర్‌ హెయిన్స్‌, ఎడిటింగ్‌ : నవీన్‌ నూలి, పాటలు : చంద్రబోస్‌, డాన్స్‌ : రాజు సుందర కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : సుకుమార్‌.

English summary
Mahesh has reportedly called NTR & congratulated him on the success of Naannaku Premato theatrical trailer and assured him of the movie’s success.
Please Wait while comments are loading...