ఆ విషయంలో పవన్ కళ్యాణ్ కంటే మహేషే బెటర్...

By Sindhu

'కొమరం పులి" ప్లాపయితే తనవంతుగా నిర్మాతకి అండగా నిలిచేందుకు ప్రమోషన్ చేయడానికి కూడా పవన్ కళ్యాణ్ రాలేదు. ఈ సినిమాకి అనే కాదు, పవన్ తాను నటించిన ఏ సినిమాకీ పబ్లిసిటీ చేయడు. అయితే 'కొమరం పులి" నిర్మాత నిర్మాణంలో ఎదుర్కొన్నానని కష్టాలు ఇంతదాకా ఎరరూ ఎక్స్ పీరియన్స్ చేసి ఉండరు. ఏ కారణాల వల్ల సినిమా ఆలస్యమై ఉన్నా పవన్ ని తప్పుబట్టడానికి లేదు కానీ తన సొంత కారణాలతో పులి నిర్మాణం ఆలస్యమవడానికి పవన్ కారకుడయ్యాడు. అయినా కానీ పులిని ప్రమోట్ చేసి నిర్మాత శింగనమల రమేష్ ని సపోర్ట్ చేయడానికి పవన్ ముందుకు రాలేదు.

అయితే అదే నిర్మాత నిర్మించిన 'ఖలేజా"కి మాత్రం హీరో తరపు నుంచి సహాయ నిరాకరణ ఎదురుకావడం లేదు. 'ఖలేజా" చిత్రాన్ని ప్రమోట్ చేయడానికి మహేష్ మీడియా ముందుకి వస్తున్నాడు. ఖలేజా అంచనాలను అందుకోలేదన్నది స్పష్టమయినా కానీ తనవంతుగా అభిమానులకి, నిర్మాతకి ఉత్సాహం తగ్గపోకుండా మహేష్ చూసుకుంటున్నాడు. ఓ విధంగా నిర్మాత శింగనమల రమేష్ కి ఇది పెద్ద బూస్ట్ అవుతుందనాలి. సాక్షాత్తూ హీరో వచ్చి ప్రమోట్ చేయడం వల్ల ఏ సినిమాకైనా ఎంతోకొంత అడ్వాంటేజ్ ఉంటుంది. అలాగే 'ఖలేజా" కూడా బాక్సాఫీస్ వద్ద పట్టు కోల్పోకుండా ఉండడానికి మహేష్ పబ్లిసిటీ హెల్స్ అవుతుందనాలి. అందుకే పవన్ కళ్యాణ్ కంటే మహేష్ బెటరని శింగనమల రమేష్ చెప్తున్నాడట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X