»   » మణిరత్నం-మహేష్ బాబు చిత్రం పూర్తి డిటేల్స్

మణిరత్నం-మహేష్ బాబు చిత్రం పూర్తి డిటేల్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu
Mahesh - Mani Ratnam film in Pre Production
హైదరాబాద్ : మణిరత్నం దర్శకత్వంలో మహేష్ నటించాలన్న కోరిక నిజం కాబోతోంది. నాగార్జున మరో కీలక పాత్రలో కనిపించే ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ ప్రారంభమైంది. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందే ఈ చిత్రంలో ఐశ్వర్యారాయ్ సైతం కీలకమైన పాత్రను పోషించనుంది. ఈ మేరకు ఐశ్వర్యారాయ్ ని కలిసినట్లు,మణిరత్నం ఆఫీస్ వర్గాలు థృవీకరించినట్లు బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.

ఇక ఈ చిత్రంలో శృతిహాసన్ సెకండ్ హీరోయిన్ గా చేయనుంది. నాగార్జున,ఐశ్వర్యారాయ్ ఇప్పటికే సైన్ చేసారని తెలుస్తోంది. అయితే మహేష్,శృతి హాసన్ ఇంకా ఎగ్రిమెంట్ లోకి రాలేదు. మహేష్ బాబు కొన్ని సూచనలు చేసారని,ఆ మేరకు స్క్రిప్టులో మార్పులు జరుగుతున్నట్లు వినికిడి. 2014 ఆగస్టు నుంచి ఈ చిత్రం ప్రారంభం అయ్యే అవకాసం ఉంది. మద్రాస్ టాకీస్, వైజయింతీ మూవీస్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

ఈ సినిమా ఒకేసారి తమిళం, తెలుగు భాషల్లో నిర్మితమవుతుంది. చర్చలు చేస్తున్నామని, మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ ఓ ప్రముఖ ఆంగ్ల పత్రికతో అన్నారు. నిజానికి, పొన్నియన్ సెల్వన్‌ను కథను తెరకెక్కించాలని మహేష్ బాబు, మణిరత్నం కలిసి అనుకున్నారు. కానీ ఎందువల్లనో అది ఆగిపోయింది. ఇది జరిగి దాదాపు రెండేళ్లవుతోంది. ప్రస్తుతం మహేష్ బాబు శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ఆగడు సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ జరుగుతోంది.


యుటివి మోషన్ పిక్చర్స్ బ్యానర్ మీద కొరటలా శివ సినిమాలో నటించడానికి కూడా మహేష్ బాబు అంగీకరించాడు. ఈ సినిమా పూర్తయిన తర్వాత మణిరత్నం సినిమా ప్రారంభమవుతుందా, దాంతో పాటు ఈ సినిమాను మహేష్ బాబు చేస్తాడా అనేది తెలియడం లేదు.

English summary
Mani Ratnam's next film will be in Telugu. The film, an action thriller will have Mahesh & Aishwarya playing the equally important leading roles. Bolly Trade confirms the same having contacted Mani Ratnam's office.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu