»   »  అల్లు అర్జున్ మార్కెట్ పై కన్నేసిన మహేష్ బాబు ! డిఫెరెంట్ స్ట్రాటజీతో ముందుకు

అల్లు అర్జున్ మార్కెట్ పై కన్నేసిన మహేష్ బాబు ! డిఫెరెంట్ స్ట్రాటజీతో ముందుకు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు పూర్తి స్ట్రాటజీ తో ముందుకు వెళ్తున్నారని ఆయన ప్లాన్స్ చూస్తే అర్దమవుతోంది. ఇంతకు ముందు...కేవలం... ఒక్క తెలుగు మార్గెట్ పైనే దృష్టి పెడితే సరిపోదనుకున్న ఆయన ఇప్పుడు రూట్ మార్చారు. తన సినిమాపై పెడుతున్న భారీ బడ్జెట్ రికవరీ కోసం మాత్రమే కాకుండా...ఇతర ఇండస్ట్రీలో కూడా తన సత్తా చూపించటానికి రెడీ అవుతున్నారు. అందుకు వేదికగా ... తన 23వ సినిమాని చేసుకుంటున్నారు.

అందులో భాగంగా ... ఒక్క తెలుగులో మాత్రమే తెలిసిన దర్శకుడు కాకుండా సౌత్ ఇండియా మొత్తం క్రేజ్ ఉన్న మురుగదాస్ తో సినిమాను కమిటయ్యారు. ఆ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళంలో కూడా ఒకేసారి రూపొందిస్తూ రెండింటినీ ఒకేరోజు రిలీజ్ చేసి తమిళ ప్రేక్షకులకు దగ్గరవ్వాలనే ప్రయత్నంలో ఉన్నాడు.

ఇలా సౌత్ లో ఉన్న రెండు పెద్ద ఇండస్ట్రీలని ఒకేసారి కవర్ చేస్తూనే ఇప్పుడు మూడో పరిశ్రమను కూడా టార్గెట్ చేశాడట మహేష్. అదే మలయాళ పరిశ్రమ. అల్లు అర్జున్ ఇప్పటికే అక్కడ జెండా పాతి వరస హిట్స్ కొడుతున్నారు. రామ్ చరణ్ కూడా తన సినిమాలను అక్కడ భారీగా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు మహేష్ కూడా మళయాళ మార్కెట్ లోకి భారీగా ప్రవేశించాలనుకుంటున్నారు. ఈ మేరకు రీసెంట్ గా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలుస్తోంది.

Mahesh, Murugadoss Film to be dubbed into Malayalam?

సినిమా షూటింగ్ కూడా దాదాపు పూర్తైపోవస్తుండటంతో ఈసారికి మలయాళంలో డబ్బింగ్ వెర్షన్ ను రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. ఇలా చేయడం వలన మహేష్ సౌత్ సినీ పరిశ్రమను దాదాపుగా కవర్ చేసినట్టవుంటుందని భావిస్తున్నారట.

ఇదిలా ఉంటే...ఈ చిత్రం రిలీజ్ డేట్ కూడా ని కూడా మురగదాస్ ప్రకటించారు కానీ, టైటిల్ విషయమై క్లారిటీ రావటం లేదు. ఇప్పటికే ఈ చిత్రం కు టైటిల్ అంటూ రకరకాల టైటిల్స్ ప్రచారంలోకి వచ్చాయి. అయితే అవేమీ కాదని, కొత్తగా మరో టైటిల్ తెరమీదకు వచ్చింది. ఆ టైటిల్ ఏమిటీ అంటే..." మర్మం".

అయితే, ఈ టైటిల్ పై ఇప్పటివరకు ఎవరూ అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. మహేష్ బాబు మూవీ టైటిల్‌పై ఇప్పటివరకు పెదవి విప్పని మురుగ ఇకనైనా ఈ విషయంపై స్పందిస్తాడా లేదా అనేదే ప్రస్తుతం మహేష్ బాబు ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

మరో ప్రక్క ఈ చిత్రాన్ని జూన్‌ 23న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు రీసెంట్ గా మురుగదాస్‌ సోషల్‌మీడియా ద్వారా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో చిత్రం ఆడియో రిలీజ్ డేట్ ఎప్పుడనే విషయం అందరిలో ఆసక్తికరంగా మారింది. అందుతున్న సమాచారం ప్రకారం ఉగాది పండగ సందర్భంగా సినిమా టైటిల్ ను, ఫస్ట్‌లుక్‌ని, మే 31న (సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు)న పాటల్ని విడుదల చేసే అవకాశాలున్నాయి.

మహేష్ బాబు ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో రకుల్‌ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్ పాత్ర పోషిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఎస్‌.జె. సూర్య విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఎన్‌.వి.ప్రసాద్‌, ఠాగూర్‌ మధు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంగీతం: హారిస్‌ జైరాజ్‌, ఛాయాగ్రహణం: సంతోష్‌ శివన్‌.

English summary
Mahesh Babu, AR Murugadoss film’s makers are planning to dub the movie into Malayalam and release it along with the Telugu and Tamil versions.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu