»   » మహేష్ మళ్లీ ముంబై బ్యాక్ డ్రాప్

మహేష్ మళ్లీ ముంబై బ్యాక్ డ్రాప్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్ ,పూరి కాంబనేషన్ లో వచ్చిన బిజినెస్ మ్యాన్ చిత్రం ముంబై బ్యాక్ డ్రాప్ లో జరిగి సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు మరోసారి మహేష్ బాబు ...తన కొత్త చిత్రానికి ముంబై బ్యాక్ డ్రాప్ ని ఎంచుకున్నట్లు సమచారం. ఆ చిత్రం మరేదో కాదు...మురుగదాస్ తో చేస్తున్న చిత్రం.

బ్రహ్మోత్సవం చిత్రం షూటింగ్ లో బిజిగా ఉన్న మహేష్ ..తన తదుపరి చిత్రంగా మురుగుదాస్ సినిమా ని ఓకే చేసారు. ఈ చిత్రం పూర్తి కాగానే కొద్ది పాటి గ్యాప్ తో ఆ సినిమా సెట్స్ పైకి వెళుతుంది. ప్రస్తుతం ప్రీ ప్రోడక్షన్ కు సంబందించిన చర్చలు జరుగుతున్నాయి.

సుమారు 100 కోట్ల బడ్జేట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా, సోషల్ రెస్పాన్స్ బెలిటి మీదే ఈ కథ ఉంటుందని సమాచారం. ఇప్పటికే ఈ సినిమాకు సంబందించిన లోకేషన్స్ కోసం మురుగుదాస్, కెమెరామెన్ సంతోష్ శివన్ ముంబాయి పరిసర ప్రాంతలు తిరుగుతున్నారు. ఇది ముంబాయ్ బ్యాక్ డ్రాప్ లో కథ ఉంటుందని ఫిల్మ్ నగర్ సమాచారం.

Mahesh murugudass film 100 crores budget

ఈ సినిమాకు ఠాగుర్ మధు మరియు ఎన్.వి. ప్రశాద్ లు ప్రోడ్యుసర్స్ గా ఉన్నారు. హీరోయిన్ కోసం ఇంకా వేటలోనే ఉన్నారు. కుదిరితే కనుక బాలివుడ్ భామ శ్రద్దా కవూర్ ని తీసుకోవడం పై పరీశీలిస్తున్నారు.

మురుగదాస్ గతంలో తమిళంలో తీసిన రమణ చిత్రాన్ని చిరంజీవి తెలుగులో... ‘ఠాగూర్' పేరుతో రీమేక్ చేసారు. తర్వాత మురుగదాస్, చిరంజీవి కాంబినేషన్లో ‘స్టాలిన్' సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. తర్వాత ఇద్దరూ కలిసి మరో స్ట్రైట్ తెలుగు సినిమా చేయాలనుకున్నారు.

చిరంజీవిని మైండ్ లో పెట్టుకుని మురుగదాస్ ఓ పవర్ ఫుల్ స్టోరీ రెడీ చేసారు. అయితే చిరంజీవికి ఆ స్టోరీ నచ్చక రిజెక్ట్ చేసారు. మురుగదాస్ అదే స్టోరీని మహేష్ బాబుకు చెప్పాడని, మహేష్ బాబుకు నచ్చడంతో ఓకే చేసారని అంటున్నారు. హైకోర్ట్ వ్యవస్థ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని టాక్.

English summary
Mahesh Babu- Murugadoss film will revolve around Mumbai backdrop and Murugadoss, Santosh Sivan will be leaving to Mumbai to scout for locations.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu