»   »  మరోసారి మల్టిస్టారర్ లో మహేష్ బాబు

మరోసారి మల్టిస్టారర్ లో మహేష్ బాబు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : క్రితం సంవత్సరం సంక్రాంతికి మహేష్ బాబు 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంతో వచ్చి సందడి చేసారు. ఆ చిత్రంలో వెంకటేష్ తో కలిసి మల్టి స్టారర్ చిత్రం చేయటం ట్రెండ్ గా మారింది. ఇప్పుడు అందరు హీరోలు మల్టి స్టారర్ చిత్రాలు చేయటానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపధ్యంలో మహేష్ మరో మల్టి స్టారర్ ఓకే చేసాడని వినికిడి. ఈ సారి మహేష్ తో పాటు నాగార్జున కూడా తెరపై కనిపించి వినోదాన్ని పంచనున్నాడు. అలాగే ఈ మల్టి స్టారర్ ని శ్రీకాంత్ అడ్డాల డైరక్ట్ చేస్తారు. నాగార్జున ఇప్పటికే ఓకే చేసాడని,స్క్రిప్టు వర్క్ జరుగుతోందని చెప్తున్నారు. ఓ పెద్ద నిర్మాత ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తారు.

ఇక మహేష్ బాబు '1 నెనొక్కడినే' సినిమా సంక్రాంతికే ప్రేక్షకుల ముందుకు రానుంది. 'దూకుడు' చిత్రం తరువాత మహేష్ బాబు హీరోగా 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై.లి. సంస్థ సుకుమార్ దర్శకత్వంలో నిర్మిస్తున్న '1' నేనొక్కడినే.. చిత్రం జనవరి 10న విడుదల కానుంది. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమా గురించి వారు వివరిస్తూ - 'ప్రేక్షకుల్లో, అభిమానుల్లో మా సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ముందు ప్రకటించిన విధంగానే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జనవరి 10న విడుదల చేస్తాం' అన్నారు. 'ఆడియో పెద్ద హిట్ అయింది.

Mahesh

మహేష్ బాబు మాట్లాడుతూ... '' ఈసారీ పండగ '1'తో మొదలవబోతోంది. అభిమానులు సిద్ధంగా ఉండండి. థియేటర్ల దగ్గర పండగ చేసుకొందాం. 2013ని మర్చిపోలేను. గత రెండేళ్ల నుంచీ సంక్రాంతికి నా సినిమాలొస్తున్నాయి. 'బిజినెస్‌మేన్‌', 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాల్ని ప్రేక్షకులు ఆదరించారు.2014లో కనీసం రెండు సినిమాలైనా సిద్ధం చేయాలన్నది నా ఆలోచన. కొత్త యేడాది సంబరాలు ఇంటి దగ్గరే చేసుకొంటా'' అన్నారు .

దేవిశ్రీప్రసాద్ ఇచ్చిన సంగీతం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. మహేశ్ తనయుడు గౌతమ్ చిన్నప్పటి మహేశ్‌గా నటించడం ఈ చిత్రానికి ఒక హైలైట్ పాయింట్. మా బేనర్‌లో ఇది మరో బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందనే నమ్మకం ఉంది అని నిర్మాతలు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఫొటోగ్రఫీ: ఆర్.రత్నవేలు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కోటి పరుచూరి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సుకుమార్.

English summary

 Now once again Mahesh babu is going to share screen space with one more star hero.If reports to believed Mahesh Babu might join with Nagarjuna for another multi starrer film.
 Nagarjuna also agreed to do movie with Mahesh and Script work is underway .Name of director Srikanth Addala is again cropping up for this project however no one is finalized yet though.As we heard a big producer is trying to produce this project along with Nagarjuna.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu