»   »  మహేష్,ఎన్టీఆర్ కూడా రోడ్డుపైకి

మహేష్,ఎన్టీఆర్ కూడా రోడ్డుపైకి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అవును, కరెక్టే...మహేష్ బాబు,ఎన్టీఆర్ లు కూడా త్వరలో అఖిల్ నడిచిన దారిలో నడవనున్నారు. ఇంతకీ ఆ దారి ఏమటీ అంటే మంచు లక్ష్మి ఛారిటీ పోగ్రామ్ మేము సైతం కోసం కష్టపడటం.

అఖిల్..ఆటో నడిపి, రానా...ముఠా మేస్త్రిలా మూటలు మోసి ఈ పోగ్రామ్ కి సహకరించారు. సెలబ్రెటీలు అంతా సామాన్యుల్లా కష్టపడి డబ్బు సంపాదించటం ఈ పోగ్రామ్ ఉద్దేశ్యం. ఈ పోగ్రామ్ ద్వారా వచ్చిన మొత్తాన్ని దాచి,ఏదైనా ప్రకృతి భీబత్సాలు జరిగినప్పుడు ఉపయోగించనున్నారు.

Mahesh and Ntr will be in Memu Saitham

ఆల్రెడీ రకుల్ ప్రీతి సింగ్, రానా, అఖిల్ ఈ పోగ్రామ్ నిమిత్తం మంచు లక్ష్మి కోరిక మేరకు వచ్చి పనిచేసారు. నెక్ట్స్ విడతలో ఎన్టీఆర్, మహేష్ రానున్నారు. ఆ తర్వాత సమంత, అల్లు అర్జున్ ని పిలవనున్నారు. ఇలా సెలబ్రెటీల అందరినీ ఇన్వాల్వ్ చేయనుంది లక్ష్మి.

ఈ పోగ్రామ్ ని టీవిలో టెలీకాస్ట్ చేసి వచ్చేమొత్తం ఈ ఫండ్ కోసం వినియోగిస్తారు. మొన్న చెన్నై వరదలు వచ్చినప్పుడు మేము సైతం అనే పోగ్రామ్ డిజైన్ చేసి మంచు లక్ష్మి,రానా,అఖిల్ వంటివారు కష్టపడ్డారు. అదే స్పూర్తితో కొనసాగిస్తున్నారు.

English summary
Mahesh & Jr NTR is going to participate in Lakshmi Manchu’s charity initiative called Memu Saitham event.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu