»   » మురగదాస్ ది కాకుండా మహేష్ ఇంకోటి??

మురగదాస్ ది కాకుండా మహేష్ ఇంకోటి??

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :ప్రస్తుతం మహెష్ బాబు, మురుగుదాస్ దర్సకత్వం లో ఓ చిత్రం కమిటైన సంగతి తెలిసిందే. సుమారు 130 కోట్ల రూపాయలతో నిర్మస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళంలో భాషల్లో రూపొందించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు మొదలయ్యాయి. అయితే ఈ లోగా ఆయన మరో ప్రాజెక్టుని ఓకే చేసినట్లు సినీ వర్గాల సమచారం.

మహేష్ తో గతంలో పోకిరి, బిజినెస్ మ్యాన్ చిత్రాలు చేసిన పూరి జగన్నాద్ ఓ ఇంటర్నేషనల్ మూవీని తీయడానికి ప్లాన్ చేస్తున్నాడు. దీనికి అంతే గ్రాండ్ అండ్ రిచ్ గా ఉంటుందని సమాచారం.

ఇందులో హాలీవుడ్ కి సంబందించిన నటులు కూడా ఇందులో నటిస్తారని, ఓ పెద్ద హాలీవుడ్ సంస్థ దీనిని నిర్మిస్తుందని తెలుస్తోంది. 2017 లో సెట్స్ పైకి వెళ్ళే అవకాశం కనిపిస్తోంది.

Mahesh ok to International Project with Puri?

మురగదాస్ చిత్రం విషయానికి వస్తే...

మురుగదాస్ అంటేనే సోషల్ ఎలిమెంట్స్ కి ప్రాదన్యమున్నా సినిమాలు తీస్తాడని అందరకి తెలుసున్న విషయం. ఇంకో విషయం ఏమిటంటే మురుగుదాస్ తన గత సినిమాలు సెవన్త్ సెన్స్, బ్రదర్స్, మొన్న వచ్చిన కత్తి చిత్రాలలో హీరో రెండు క్యారక్టర్స్ లో కనిపించి కనువిందు చేసారు. ఇప్పుడు మహేష్ కోసం కూడా అదే తరహాలో స్క్రిప్టు రెడీ చేసారంటున్నారు.

మురుగదాస్ దర్శకత్వంలో రూపొందబోయే తన కొత్త చిత్రంలో మహేష్ రెండు క్యారక్టర్స్ లో కనిపించనున్నాడని, దీనిలో కూడా సోషల్ ఎలిమోంట్స్ ఉంటాయని, సెటైరికల్ డ్రామా అని ఫిల్మ్ వర్గలా సమాచారం.

ప్రస్తుతం మహేష్ చేస్తున్న బ్రహ్మోత్సవం అనంతరం ఈ చిత్రం ఉండబోతోందని చెప్తున్నారు. మరి మురగదాస్ ఈ ప్రాజెక్టుతో ఏం సంచనలం సృష్టించనున్నారో చూడాలి.

English summary
Now Puri Jagannadh is planning a bigger movie with Mahesh Babu which will not only be made on international scale but it will also have an international cast and crew.
Please Wait while comments are loading...