Just In
- 6 min ago
ఘనంగా గృహ ప్రవేశ వేడుక.. కొత్తింట్లోకి అడుగుపెట్టిన బిగ్ బాస్ ఫేమ్ కౌశల్
- 50 min ago
వాడి కోసం ఏడేళ్ల జీవితాన్ని నాశనం చేసుకున్నావ్.. రష్మీపై బుల్లెట్ భాస్కర్ కామెంట్స్
- 1 hr ago
ఇంకా చావలేదా? అని అడిగారట.. ట్రోలింగ్‌పై నటి కామెంట్స్
- 2 hrs ago
అభిమాని చర్యకు షాక్.. గుండెపై పచ్చబొట్టు.. సింగర్ యశస్వి క్రేజ్‌కు నిదర్శనం
Don't Miss!
- News
యూపీలో ఆగని అత్యాచారాలు.. కాపాడాల్సిన పోలీసే కాటేశాడు.. మరో ఘటనలో ప్రభుత్వ ఉద్యోగినిపై అత్యాచారం...
- Automobiles
పోర్స్చే 911 టర్బో ఎస్ సూపర్ కార్లో వెల్తూ కెమెరాకి చిక్కిన క్రికెట్ గాడ్
- Finance
భారత్ నుంచి యూకేకు స్టార్ స్ట్రీక్ క్షిపణులు: టెక్నాలజీ భాగస్వామిగా, ఇతర దేశాలకు కూడా
- Lifestyle
వెల్లుల్లి పూర్తి ప్రయోజనం పొందడానికి ఎలా తినాలో మీకు తెలుసా?ఇక్కడ చదవండి ...
- Sports
రోహిత్.. ఎందుకింత నిర్లక్ష్యం! అప్పనంగా వికెట్ సమర్పించుకున్నావ్! గవాస్కర్ ఫైర్!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
దేవుడ్ని ప్రశ్నిస్తున్న మహేష్ బాబు (ఫొటో)
హైదరాబాద్ : మహేష్,శృతిహాసన్ కాంబినేషన్ లో కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ రెగ్యులర్ గా జరుగుతోంది. ఈ చిత్రం షూటింగ్ లో భాగంగా మహేష్ బాబు..దేవుడ్ని ప్రశ్నిస్తున్న సన్నివేశం చిత్రీకరించినట్లు తెలుస్తోంది. లొకేషన్ లోని ఈ ఫొటో బయిటకు వచ్చింది. మీరూ ఓ లుక్కేయండి
ఇక అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని ఫిబ్రవరి 17 న మహా శివరాత్రి పూట విడుదల చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. అలాగే మే 1 న సినిమాని విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి శ్రీమంతుడు అనే టైటిల్ ప్రచారంలో ఉంది. నిర్మాత,దర్శకుడు ఇప్పటివరకూ ఏ టైటిలూ ప్రకటించలేదు. ఈ టైటిల్ ని రిజిస్టర్ మాత్రం చేసారు.
ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి ఇప్పటి వరకు టైటిల్ అయితే ఖరారు కాలేదు. ఆ మధ్య పలు టైటిల్స్ వినిపించినా...అవేవీ కాదని కొట్టిపారేసారు దర్శకుడు శివ.

అయితే తాజాగా మరో టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. ‘శ్రీమంతుడు' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నారు. అయితే ఇందులో నిజం ఎంతో దర్శకుడు కొరటాల శివ తేల్చాల్సి ఉంది. ఈ విషయం విన్న ఫ్యాన్స్ ఈ టైటిల్ మహేష్ బాబు ఇమేజ్ కు తగిన విధంగా లేదని అంటున్నారు. ఈ టైటిల్ విషయమై కొరటాల శివ త్వరలోనే సోషల్ నెట్వర్కింగులో స్పందించే అవకాశం ఉంది.
మహేష్ తో ప్రాజెక్టు మొదలైన నాటి నుంచి ఏదో ఒక రూమర్ వస్తూనే ఉండటం...వెంటనే దర్సకుడు కొరటాల శివ ఖండించటం కామన్ అయ్యిపోయింది. కథపై పూర్తి కసరత్తు చేసి మరీ కొరటాల శివ కసిగా రంగంలోకి దిగాడంటున్నారు. హిట్ ఖాయం అనే మాట ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తోంది. ''భారీ హంగులతో తెరకెక్కుతున్న చిత్రమిది. మహేష్ శైలికి తగ్గట్టుగా మాస్ అంశాల్ని మేళవించి కథను సిద్ధం చేశారు దర్శకుడు. అందరికీ నచ్చే ఓ మంచి సినిమా అవుతుంది''అని చెబుతున్నారు నిర్మాతలు.
ఓవర్సీస్ లో అత్తారింటికి దారేది వంటి భారీ సినిమాలు పంపిణీ చేసి ఎంతో మంచి పేరు తెచ్చుకున్న మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంగీతం:దేవిశ్రీప్రసాద్,ఫోటోగ్రఫిః మది, ఫైట్స్: అరసు, ఎగ్జిక్యూటివ్ ప్రసాద్:అశోక్, నిర్మాతలుః ఎర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్, సివియమ్. ఛాయాగ్రహణం: ఆర్.మది, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు.