»   » ఎక్సక్లూజివ్ : మహేష్-రాజమౌళి ప్రాజెక్టు కొత్త డిటేల్స్

ఎక్సక్లూజివ్ : మహేష్-రాజమౌళి ప్రాజెక్టు కొత్త డిటేల్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :మహేష్ బాబు , రాజమౌళి కాంబినేషన్లో వచ్చే చిత్రం గురించి గత కొద్ది రోజులుగా హాట్ టాపిక్ రన్ అవుతున్న సంగతి తెలిసిందే. రాజమౌళి ఈ చిత్రం గురించి ఖరారు చేయగానే కొన్ని విషయాలు బయిటకు రావటం మొదలయ్యాయి. మరో ప్రక్క మహేష్ సైతం ఈ చిత్రం కొన్ని విషయాలు బయిటపెట్టారు. అయితే ఫిల్మ్ సర్కిల్స్ నుంచి కొన్ని ఎక్సక్లూజివ్ సమాచారాలు తెలిసాయి ఈ ప్రాజెక్టు గురించి. ఆ వివరాలు క్రింద చూడండి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఈ చిత్రం జేమ్స్ బాండ్ తరహా కథాంశంతో ఉండబోతోందని సమాచారం. అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ చేసిన జేమ్స్ బాండ్ చిత్రాలను పోలి ఉంటుందని, ఇండియన్ జేమ్స్ బాండ్ చిత్రంలా కథని తయారు చేస్తున్నారని అంటున్నారు. అలాగే ఈ చిత్రంలో టెక్నాలజీతో పాటు హ్యూమన్ ఎమోషన్స్ కు అథిక ప్రయారిటీ ఇవ్వనున్నట్లు చెప్పుతున్నారు. ఇక ఈ చిత్రాన్ని కెఎల్ నారాయణ నిర్మించనున్నారు.‘బాహుబలి-2′ పూర్తయ్యాక ఈ ప్రాజెక్టు సెట్స్‌పైకి వెళ్తుంది.

Mahesh-rajamouli project details

మహేష్ బాబు రీసెంట్ గా మాట్లాడుతూ.. "రాజమౌళి గారితో ఓ సినిమా చేసేందుకు ఇంతకుముందే ప్లాన్ చేశాం. స్క్రిప్ట్ ఇంకా ఫైనలైజ్ కాలేదు. ఈ కాంబినేషన్ కోసం నేను కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నా" అంటూ తెలిపారు.

ఇక మహేష్-కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన ‘శ్రీమంతుడు' సినిమా ఆగష్టు 7న భారీ ఎత్తున విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, కె.చంద్రశేఖర్‌రావులకు ప్రత్యేకంగా ప్రదర్శించాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. వూరిని దత్తత తీసుకోవాలనే ఓ చక్కటి సందేశం చుట్టూ సాగే కథ ఇది. శ్రుతి హాసన్‌ హీరోయిన్ గా చేస్తోంది. కొరటాల శివ దర్శకుడు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.

చిత్రం కాన్సెప్టు ఏమిటీ అంటే....వూరు చాలా ఇచ్చింది. అందమైన బాల్యాన్ని, మర్చిపోలేని స్నేహాన్నీ, వదులుకోలేని జ్ఞాపకాల్ని. ఇన్నిచ్చిన వూరుకి తిరిగి ఏమిచ్చాం..? రెక్కలొచ్చి వెళ్లిపోయాక.. పండగలకీ పబ్బాలకీ సొంతూరెళ్లి - మహా అయితే సెల్ఫీ దిగొచ్చాం. అంతేగా..? అందుకే.. 'వెలకట్టలేని ఆస్తిని ఇచ్చిన వూరికి మనమూ ఏదోటి తిరిగివ్వాలి..' అని చెప్పడానికి 'శ్రీమంతుడు' వస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు ఇటీవలే విడుదలయ్యాయి.

English summary
Rajamouli’s film with Mahesh Babu is likely to materialize after the completion of the second part of Baahubali.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu