»   »  వరుడు కోరికపై ప్రియాంక....

వరుడు కోరికపై ప్రియాంక....

Posted By:
Subscribe to Filmibeat Telugu
Mahesh Babu
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 'వరుడు'గా ముస్తాబవటానికి సిద్ధమవుతున్న మహేష్ తనకు జంటగా ప్రియాంకా చోప్రాను కోరుకుంటున్నాడట. ఇప్పుడు పరిశ్రమ వర్గాల్లో హాట్ హాట్‌గా ప్రచారమవుతున్న ఈ విషయం లోకి వెళ్తే... మొదట ఈ సినిమాలో దీపికా పడుకోనే, ఇలియానా పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. ఇలియానాతో ఇప్పటికే 'పోకిరి' ని చేసి వున్నందున ఇంతదాకా చేయని హీరోయిన్ తో నటించాలని మహేష్ భావిస్తున్నాడు. అందుకే ఇలియానాకు 'నో' చెప్పాడు. ఇక రివర్స్ లో దీపిక ఈ ప్రాజెక్టు కు నో చెప్పిందిట.

'ఓం శాంతి ఓం' తెచ్చిన క్రేజ్‌తో బాలీవుడ్‌లో సినిమాల్నీ సంపాదించుకుని బిజీగా వుండటం వల్ల డబ్బుకోసం రీజనల్ సినిమాల్లో చేయటం ఎందుకని ఆమె భావిస్తోందిట. దాంతో ఆల్టర్ నేటివ్ గా మహేష్ మాజీ మిస్ వరల్డ్ ప్రియాంకా చోప్రా ని ప్రపోజ్ చేసాడట. దాంతో దర్శక నిర్మాతలు ఆమెను సంప్రదించారు. అయితే ప్రియాంక ఈ ఆఫర్‌కు ఆనందం వ్యక్తం చేసినా మరో ఆరు నెలలు ఆగాలని అప్పటి దాకా డేట్స్ ఎడ్జెస్ట్ చేయలేనని తేల్చేసింది. దానికి మహేష్ సరేననన్నాడుట. అయితే త్రివిక్రమ్ మాత్రం అంతకాలం వెయిట్ చేసే స్థితిలో లేడు.

అందుకే అతడిని కన్విన్స్ చేసి, మహేష్‌తో థమ్సప్ యాడ్‌లో చేసిన అమ్మాయిని సెలక్ట్ చేశాడు. కానీ మహేష్ మాత్రం ఆమెకు ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. మరో ప్రక్క జూన్ తొలి వారంలోనే 'వరుడు' సెట్స్ మీదకు వెళ్ళే టైము దగ్గర పడుతున్నందున హీరోయిన్ విషయాన్ని వీలైనంత తొందరగా తెమల్చాలని త్రివిక్రమ్, నిర్మాత శింగనమల రమేష్ భావిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో రెండో హీరోయిన్‌గా పార్వతీ మెల్టన్‌ని ఎంపిక చేసారు. మరి ప్రియాంక కాస్త పెద్ద మనసు చేసుకుని ఒప్పుకుంటే ఎవరికీ టెన్షన్ ఉండదు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X