గమనించారా? 'బ్రహ్మోత్సవం' రిలీజ్ డేట్ మారింది
హైదరాబాద్: సూపర్‌స్టార్ మహేష్‌బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బ్రహ్మోత్సవం'. ఈ చిత్రం ఏప్రియల్ 8, 2016న విడుదల చేయటానికి తేదీని ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాని ఏప్రియల్ 29 కి వాయిదా వేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు డిస్ట్రిబ్యూటర్ ఎగ్రిమెంట్స్ చేసినట్లు తెలుస్తోంది.
ఈ సినిమాకు సంబంధించి రెండు ఆసక్తికర విషయాలు ఉన్నాయి. మహేష్ బాబు ఈ సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరించడం ఒక విశేషం అయితే, మహేష్ ఈ సినిమాతో తమిళంలో ఎంట్రీ ఇవ్వనుండడం మరో విశేషం. ఇప్పటివరకూ కేవలం డబ్బింగ్ సినిమాల ద్వారానే తమిళంలో పరిచయమైన మహేష్, బ్రహ్మోత్సవంతో తమిళంలో నేరుగా ఎంట్రీ ఇవ్వనుండడం అభిమానులకు ఆనందకరంగా మారింది.

విజయవాడ నేపథ్యంలో సాగే ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి షూటింగ్ జరుపుకుంటోంది. మహేష్ కెరీర్లో ఇది మరో మరిచిపోలేని సినిమాగా నిలుస్తుందని శ్రీకాంత్ అడ్డాల మొదట్నుంచీ చెబుతూ వస్తున్నారు.
ఈ సినిమాలో మహేష్ ముగ్గురు భామలతో ఆడిపాడనున్నారు. సమంత, కాజల్ అగర్వాల్, ప్రణీత హీరోయిన్లు గా నటిస్తున్నారు. పీవీపీ సినిమా పతాకంపై ప్రసాద్.వి.పొట్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ స్వరాలందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











