»   » కొరటాల శివ భార్య ప్రేరణతోనే కథ, మహేష్ కు అదే నచ్చింది?

కొరటాల శివ భార్య ప్రేరణతోనే కథ, మహేష్ కు అదే నచ్చింది?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఎన్టీఆర్ తాజా చిత్రం జనతాగ్యారేజ్ సూపర్ హిట్ అవటంతో మొక్కు చెల్లించుకున్నాడు కొరటాల శివ. తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంలోనే కొత్త ప్రాజెక్ట్ విషయాన్ని ప్రకటించాడు. తర్వాత సినిమా మహేష్ తో చేస్తున్నట్లు ప్రకటించాడు. జనవరి నుంచి సెట్స్ లోకి వెళుతుందని స్పష్టం చేశాడు. ప్రతి సినిమా రిలీజ్ ముందూ.. తర్వాత శ్రీవారి దర్శనం సెంటిమెంట్ అన్నారు శివ.

ఇక ప్రతి సినిమాకు ఓ వైవిధ్యమైన కథతో వచ్చే కొరటాల.. ప్రిన్స్ ను సరికొత్తగా చూపించబోతున్నాడంట. సెల్ఫ రెస్పెక్ట్ గా కథ ఉంటుందని టాలీవుడ్ టాక్. నీకు నువ్వు ప్రేమించుకో.. నిన్ను నువ్వు గౌరవించుకో.. నువ్వు చేసే పనిని ప్రేమించి ఇలాంటి కొటేషన్స్ తో కథ ఉంటుందని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు అక్కడితో ఆగకుండా ఈ కథకి ఆయన భార్య ప్రేరణ అంటున్నారు.

కొరటాల శివ భార్య రామకృష్ణ పరమహంసను ఫాలో అవుతారు. అయితే ఇప్పుడు కొరటాల వైఫ్ అరవింద ఎఫెక్ట్ త్వరలో మనోడు చేయబోయే మహేష్ బాబు సినిమాపై పడిందని తెలుస్తోంది. నిజానికి లండన్ లో చదువుకున్న అరవింద.. కొరటాల శివను ప్రేమించి పెళ్లిచేసుకున్నారు.

Mahesh's Film Inspired from Koratala's Wife

అయితే ఆమెకు సింప్లిసిటీ అంటే ఇష్టమట. ఇప్పటివరకు కొరటాల సంపాదించిన కోట్లలో కేవలం బ్రతకడానికి తినడానికి కావాల్సినంత ఉంచుకుని.. మిగిలినదంతా సొసైటీకి తిరిగిచ్చేయాలని భావజాలం ఆమెది. అందుకే పేద పిల్లల ఎడ్యుకేషన్ కోసం ఏమైనా సాయం చేయాలని ఆమె ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

అలాగే సాయంత్రం ఏడు గంటలకు కొరటాల ఇంటికొచ్చేసిన తరువాత.. ఇంట్లో ఇద్దరి ఫోన్లూ స్విఛాఫ్ చేసేసి.. చక్కగా ఒకరితో ఒకరు టైమ్ స్పెండ్ చేస్తారట. సినిమాలు తీసే లైఫ్ కంటే తన పర్సనల్ లైఫ్ ఇంకా బాగుంటుందని కొరటాల చెప్పడం విశేషం. అందుకే ఇప్పుడు ఆయన సతీమణిని చూసి ఇనస్పయిర్ అయ్యి ఒక క్యారెక్టర్ డిజైన్ చేశారని. త్వరలో మహేష్ బాబు చేయబోయేది అదే క్యారెక్టర్ అంటున్నారు. నిజమెంత ఉందో తెలియాల్సి ఉంది.

English summary
Koratala's wife Aravinda is heard to have taught him to value his personal life and he has based his film with Mahesh on this sensitive point.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu