For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మహేష్,కొరటాల శివ చిత్రం కథకి స్పూర్తి ఇదా?

  By Srikanya
  |

  హైదరాబాద్ : మహేష్ బాబు, శృతి హాసన్ జంటగా మిర్చి ఫేం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంపై మరో టాపిక్ మొదలైంది. ఈ చిత్రం కథ మహేష్ బావ గల్లా జవదేవ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతోందని ఇంటర్ నెట్ లో టాక్ మొదలైంది. ఆ మధ్యన శ్రీమంతుడు టైటిల్ అంటూ వచ్చిన దానికి జస్టిఫికేషన్ గా ఈ టాపిక్ ని తెచ్చారా అని కొందరు అనుమాన పడుతున్నారు. మరి కొరటాల శివ ఈ విషయమై ఏమంటారో చూడాలి.

  "మేము బెస్ట్ గా అవుట్ పుట్ తీసుకురావటానికి కొంత టైమ్ తీసుకుంటాం...జనవరి 1 న ఫస్ట్ లుక్ ని విడుదల చేయటం అనేది కేవలం రూమర్ మాత్రమే ", అని తేల్చి చెప్పారు. మరో ప్రక్క ఈ చిత్రానికి శ్రీమంతుడు అనే టైటిల్ ప్రచారంలో ఉంది. దాన్ని ఎప్పుడు ఖండిస్తారో చూడాలి. గతంలోనూ శృతి హాసన్ ని తొలిగించారనే వార్తపైనా, మగాడు అనే టైటిల్ పైనా ఖండనలు చేసిన సంగతి తెలిసిందే.

  https://www.facebook.com/TeluguFilmibeat

  చిత్రం విశేషాలకు వస్తే...

  Mahesh's 'Sreemanthudu' Is Galla Jaidev's Story

  మహేష్ బాబు, శృతి హాసన్ జంటగా మిర్చి ఫేం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రాన్ని వేసవిలో మే 1న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఈ సంవత్సరం మహేష్ కు చేదు అనుభవమే మిగిలింది. చేసిన రెండు చిత్రాలు ''1'' నేనొక్కడినే, ''ఆగడు '' కూడా ఫ్లాప్ జాబితాలో పడిపోవడంతో కొరటాల తో చేస్తున్న సినిమా హిట్ అయి అభిమానులను అలరిస్తుందని ఆశిస్తున్నాడు మహేష్.

  హీరోయిన్ పూర్ణ ఈ చిత్రంలో స్పెషల్ సాంగ్ చేస్తోంది. క్లాసికల్ డాన్సర్ కోసం వెతికి చివరకు పూర్ణతో ముందుకు వెళ్తున్నట్లు సమాచారం. అలాగే ... ఈ పాట గ్రామీణ నేపధ్యంలో వస్తుందని చెప్తున్నారు. పూర్ణ..కథక్ డాన్సర్ కావటంతో ఆమె ఫెరఫెక్ట్ గా ఆ పాటకు సూట్ అవుతుందని ఎంపిక చేసారని తెలుస్తోంది. ఈ పాట కోసం హైదరాబాద్ లో స్పెషల్ సెట్ వేయిస్తున్నారు.

  ప్రిన్స్ మహేష్ అభిమానులు కూడా భారీ హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆగడు నిరాశని మిగల్చడంతో కొరటాల శివ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మహేష్ సరసన అందాల భామ శృతి హసన్ నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీస్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

  ''భారీ హంగులతో తెరకెక్కుతున్న చిత్రమిది. మహేష్‌ శైలికి తగ్గట్టుగా మాస్‌ అంశాల్ని మేళవించి కథను సిద్ధం చేశారు దర్శకుడు. అందరికీ నచ్చే ఓ మంచి సినిమా అవుతుంది''అని చెబుతున్నారు నిర్మాతలు. జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మహేష్‌బాబు శైలికి తగిన కథ ఇది. కుటుంబ బంధాలకూ చోటుంది. దేవిశ్రీ ప్రసాద్‌ అందించే బాణీలు ఆకట్టుకొంటాయని నిర్మాతలు చెప్తున్నారు.

  మహేష్ బాబు మాట్లాడుతూ....కొరటాల చెప్పిన కథ ఎంతో ఎక్సయిటింగ్ గా ఉంది. మా కాంబినేషన్ లో ఇది మంచి కమర్సియల్ ఫిలిం అవుతుంది. మైత్రి మూవీ మేకర్స్ బేనర్ లో ఈ సినిమా రూపొందుతోంది అన్నారు.

  దర్శకుడు మాట్లాడుతూ ''నా రెండో చిత్రమే మహేష్‌బాబుతో చేయబోతుండడం ఆనందంగా ఉంది. క్లాస్‌, మాస్‌ కలిపిన కథలో మహేష్‌ పాత్ర ఆకట్టుకొంటుంది. ఈ కథలో అన్ని రకాల వాణిజ్య హంగులూ ఉన్నాయి. మంచి అభిరుచి ఉన్న నిర్మాతలు దొరికారు.ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మించడానికి ప్లాన్ చేశారు. యువతరం, కుటుంబం తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుంది. మహేష్ బాబు అభిమానులు మెచ్చే చిత్రం అవుతుంది ''అన్నారు.

  నిర్మాతలు మాట్లాడుతూ... మా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించే తొలి చిత్రమే సూపర్ స్టార్ మహేష్ బాబు గారితో చెయ్యడం మా అదృష్టంగా భావిస్తున్నాము. మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఎంతో భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మింస్తున్నాము అన్నారు.

  మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శ్త్తకత్వంలో ఓ భారీ చిత్రం రూపొందుతోంది. ఓవర్సీస్ లో అత్తారింటికి దారేది వంటి భారీ సినిమాలు పంపిణీ చేసి ఎంతో మంచి పేరు తెచ్చుకున్న మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంగీతం:దేవిశ్రీప్రసాద్,ఫోటోగ్రఫిః మది, ఫైట్స్: అరసు, ఎగ్జిక్యూటివ్ ప్రసాద్:అశోక్, నిర్మాతలుః ఎర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్, సివియమ్. ఛాయాగ్రహణం: ఆర్‌.మది, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు.

  English summary
  Mahesh Babu is now busy with the shaping up of his new movie under the direction of Koratala Siva. it is heard that the story finds its roots in the life of Galla Jaidev, brother-in-law of Mahesh.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X