»   » శ్రీను వైట్ల-మహేష్ బాబు మళ్లీ... వారి నష్టాలను పూడ్చడానికేనా?

శ్రీను వైట్ల-మహేష్ బాబు మళ్లీ... వారి నష్టాలను పూడ్చడానికేనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్ బాబు కెరీర్లో హిట్ సినిమా ‘దూకుడు'. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈచిత్రం అప్పట్లో మహేష్ బాబు కెరీర్లో హయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘ఆగడు' చిత్రం భారీ ప్లాప్. ఈ రెండు చిత్రాలను నిర్మించింది 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ వారే.

త్వరలో మహేష్ బాబు, శ్రీను వైట్ల కాంబినేషన్లో మరో సినిమా రాబోతోంది. 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ వారు ఈ సినిమాను నిర్మించబోతున్నారు. ఆగడు సినిమా 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ సంస్థకు భారీ నష్టాలను తెచ్చిన నేపథ్యంలో సంస్థను నష్టాల నుండి బయట పడేసేందుకే ఇద్దరూ ఈ సినిమా చేస్తున్నట్లు సమాచారం.

 Mahesh-Sreenu Vaitla next film will go on floors in 2016

ఈ సినిమాకు మహేష్ బాబు, శ్రీను వైట్ల ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోవడం లేదట. గతంలో మహేష్ బాబు హీరోగా 14 రీల్స్ సంస్థ నిర్మించిన ‘1-నేనొక్కడినే' కూడా నష్టాలను తెచ్చింది. ఈ నేపథ్యంలో తనను నమ్ముకుని సినిమాలు తీసిన 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ సంస్థను నష్టాల నుండి గట్టెక్కించాలని మహేష్ బాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

2016 నాటికి ఈ సినిమా ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం మహేష్ బాబు, శ్రీను వైట్ల వారి వారి ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత 2016లో 14 రీల్స్ సంస్థ కోసం చేయబోయే సినిమాపై దృష్టి సారించనున్నారు.

English summary
14 Reels, the producers of Mahesh-Sreenu Vaitla combo's earlier flicks Dookudu and Aagadu, will once again team up with them and produce a film sometime in 2016.
Please Wait while comments are loading...