»   » మహేష్ సొంత బ్యానర్! కారణం అదే?

మహేష్ సొంత బ్యానర్! కారణం అదే?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : హీరోలకు సొంత బ్యానర్ లు ఉండటం కొత్తేమీ కాదు. ఎందుకంటే ఎప్పుడే అవసరమొస్తుందో...మనకు నచ్చి న సబ్జెక్టు...కొద్దిగా రిస్క్ అనిపించినప్పుడు వేరే నిర్మాతపై రుద్దే బదులు..సొంతంగా తీసుకుని కష్ట,నష్టాలు పడొచ్చు. అలాగే...మన టేస్ట్ కు తగిన చిత్రాలు తీసుకోవచ్చు. ముఖ్యంగా మన క్రేజ్ ని మనమే బిజినెస్ చేసుకోవచ్చు...ఫైనల్ గా నిర్మాతలు ఎవరూ మన మీద తగినంత పెట్టడానికి ధైర్యం చేయలేని ఫ్లాఫుల దశలో...మనమే ఓ హిట్ సినిమా తీసుకుని ...చెలరేగిపోవచ్చు. ఇన్ని లాభాలు ఉంటాయి కాబట్టి హీరోలు తమ సొంత బ్యానర్లు పెట్టుకుని కెరీర్ ని కొనసాగిస్తూంటారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


అయితే ఇన్ని ఉపయోగాలు ఉన్నా మహేష్ తను సొంతంగా ఇప్పటివరకూ బ్యానర్ పెట్టలేదు. తన తండ్రి బ్యానర్ లేదా..తన సోదరి మంజుల బ్యానర్ లోనో, ఇంకా కాకకపోతే తన సోదరుడు రమేష్ బాబు బ్యానర్ లోనే సినిమాలు చేస్తూ వస్తున్నాడు. వాటినే సొంత బ్యానర్ లుగా భావిస్తున్నాడు. అయితే పిల్లలూ పెద్దవాళ్లు అవుతున్నారు. తన భార్య నమితకు బిజినెస్ తో కూడిన వ్యాపకం ఉంటుంది..ఇవన్ని దృష్టిలో పెట్టుకునే మహేష్, నమ్రతలు ఓ బ్యానర్ కు శ్రీకారం చుడుతున్నట్లు తెలుస్తోంది.


Mahesh to Launch 'Gautham Productions'!

'గౌతమ్ ప్రొడక్షన్స్ ' పేరుతో ఈ బ్యానర్ ని లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అదీ తండ్రి పుట్టిన రోజున లాంచ్ చేస్తారని ఫిల్మ్ నగర్ సమాచారం. ఈ బ్యానర్ పై ప్రయోగాత్మక చిత్రాలు, నోవల్ ఐడియా ఉన్న చిత్రాలు నిర్మించాలనే ఆలోచన ఉన్నట్లు చెప్తున్నారు. తనే హీరోగా కాకుండా...చిన్న చిన్న హీరోలతోనూ ఈ బ్యానర్ లో చిత్రాలు చేస్తారు. ఈ బ్యానర్ తన బావ మరిది సుధీర్ బాబుకు ఉపయోగపడుతుందని కొందరు అప్పుడే కామెంట్స్ చేస్తున్నారు. కాకపోతే మహేష్ ఇంటినుంచి వచ్చిన ఏ బ్యానర్ లోనూ సుధీర్ బాబుకు అవకాసం ఇవ్వలేదు.


ప్రస్తుతం మహేష్ బాబు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న సినిమా షూటింగులో బిజీగా ఉన్నారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయిన తర్వాత ‘బ్రహ్మోత్సవం' స్టార్ట్ చేశారు. మే నెలాఖరున రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.


Mahesh to Launch 'Gautham Productions'!

మహేష్ బాబు, దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కలయికలో తెరకెక్కుతున్న రెండవ సినిమా ‘బ్రహ్మోత్సవం'. పివిపి సినిమాస్ పతాకంపై ప్రముఖ నిర్మాత ప్రసాద్ వి పొట్లూరి నిర్మిస్తున్నారు. మిక్కి జె మేయర్ స్వరాలు సమకూరుస్తారు. మే నెలలో లాంచనంగా పూజా కార్యక్రమాలతో ఈ సినిమాను ప్రారంభిస్తారని సమాచారం.


ఈ సినిమాలో మహేష్ సరసన హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుందని సమాచారం. క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నటీనటుల కోసం కాస్టింగ్ కాల్ యాడ్ ఇచ్చారు. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' తర్వాత మహేష్, శ్రీకాంత్ అడ్డాల కలయికలో వస్తున్న ఈ సినిమాపై భారి అంచనాలు ఏర్పడ్డాయి. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.

English summary
Mahesh Babu and his dear wife Namrata are going to launch a new production house very soon. This production house will be named after their son Gautham, says the buzz.
Please Wait while comments are loading...