»   » మహేష్, త్రివిక్రమ్ సినిమా టైటిల్ ఫైనల్ గా....

మహేష్, త్రివిక్రమ్ సినిమా టైటిల్ ఫైనల్ గా....

Posted By:
Subscribe to Filmibeat Telugu

మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రెడీ అవుతున్న చిత్రానికి కలేజా అని ప్రచారంలో ఉంది. అయితే 'సారధి' అనే టైటిల్ ఓకే కావచ్చునని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. అనూష్క హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రంలో మహేష్ ..క్యాబ్ డ్రైవర్ గా కనిపిస్తాడు. ప్రకాష్ రాజ్ విలన్ గా చేస్తున్నాడు. ప్రకాష్ రాజ్, మహేష్ ల మద్య జరిగే క్లైమాక్స్ సన్నివేశాలను గత నాలుగు రోజులుగా పూనే దగ్గరలోని ఓ పది కిలోమీటర్లు దూరంలోని విలేజ్ లో చేస్తున్నారు. 'సారధి' టైటిల్ పై మహేష్ సైతం ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ మరో టైటిల్స్ చెప్పినా దీనినే ఫైనలైజ్ చేస్తారని అంటున్నారు. ఇక ఈ చిత్రం ఆగస్టు తొమ్మిదిన రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. ఆ రోజు మహేష్ బాబు పుట్టినరోజు కావటంతో ఆ డేట్ నిర్ణయించారని చెప్తున్నారు. ఈ చిత్రం తర్వాత శ్రీనువైట్లతో చేసే చిత్రం జూన్ నెలాఖరున ప్రారంభించటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఆ తర్వాత సురేంద్ర రెడ్డితో మిస్టర్ ఫెరఫెక్ట్, లింగుస్వామితో చేసే చిత్రం ఉంటుంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu