»   »  ఏది నిజం..ఏది అబద్దం..రోజుకో వార్త, మహేష్ ఫ్యాన్స్ కన్ఫూజ్

ఏది నిజం..ఏది అబద్దం..రోజుకో వార్త, మహేష్ ఫ్యాన్స్ కన్ఫూజ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్స్‌ ఏ.ఆర్.మురుగదాస్‌తో ఓ సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. రీసెంట్ గాచెన్నైలో సెకండ్ షెడ్యూల్ మొదలుపెట్టిన టీమ్ శరవేగంగా షూటింగ్ పూర్తి చేస్తోంది. అయితే ఈ సినిమాలో మహేష్ రోల్ గురించి రకరకాల వార్తలు బయిటకు వచ్చి మహేష్ ఫ్యాన్స్ ని కన్ఫూజన్ కు గురి చేస్తున్నాయి.

కొందరేమో ..ఈ సినిమాలో మహేష్ ఓ ఇంటిలిజెన్స్ ఆఫీసర్‌గా కనిపించనున్నారని,. ఆయన గత చిత్రాలకు భిన్నంగా డిఫరెంట్ లుక్, యాక్టింగ్‌తో మహేష్ మెప్పించనున్నట్లు చెప్తున్నారు. అయితే అదే సమయంలో న్యాయవ్యవస్థతో పోరాడే లాయర్ అని కొందరంటున్నారు. అబ్బబ్బే అలాంటిదేమీ లేదు... ఈ సినిమాలో సూపర్ స్టార్ చేస్తున్నది సూపర్ కాప్ రోల్ అని లేటెస్ట్ టాక్. ఇందులో ఏది నిజం..ఏది నమ్మాలి అనే కన్ఫూజన్ ఏర్పడుతోంది. అయితే అఫ్ కోర్స్ ...ఈ కన్ఫూజన్ పోవాలంటే మినిమం ఫస్ట్ లుక్ లేదా టీజర్ విడుదల అయ్యేదాకా వెయిట్ చెయ్యక తప్పదు.

ఇక ఈ చిత్రం ఓ సోషల్ మెసేజ్ ఉన్న కమర్షియల్ ఎంటర్‌టైనర్‍గా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో సినిమా రూపొందుతోంది. మహేష్ సరసన రకుల్ ప్రీత్ హీరోయిన్‌గా నటిస్తోండగా, ప్రముఖ దర్శకుడు ఎస్.జె.సూర్య విలన్‌గా నటిస్తున్నారు.

Mahesh turns intelligence officer or Police?

హరీస్ జైరాజ్, సంతోష్ శివన్ లాంటి టాప్ టెక్నీషియన్స్ పనిచేస్తోన్న ఈ సినిమాను ఎన్.వి.ప్రసాద్, ఠాగూర్ మధు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవి కానుకగా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

అలాగే తొలిసారిగా మహేష్ బాబు, మురుగదాస్ కలిసి చేస్తున్న చిత్రం కావడంతో పాటు ఈ మూవీలో చాలానే స్పెషాలిటీస్ చూడబోతున్నాం. ఈ సినిమాలో మహేష్, రకుల్ లు మొదటిసారిగా జతకడుతున్నారు. అలాగే డైరెక్టర్ ఎస్ జే సూర్య.. విలన్ గా తొలిసారిగా తెలుగులో నటిస్తున్నాడు. మహేష్ బాల నటుడుగా ఉన్నపుడు బజారురౌడీ చిత్రంలో నదియాతో నటించగా.. మళ్లీ ఇన్నేళ్లకి వీరిద్దరూ ఓ సినిమాలో చేస్తున్నారు.

English summary
Currently discussion is that for sure Mahesh will be seen in a police man getup yet again for his upcoming film or he will be seen as a RAW agent?
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu