»   » మహేష్, మోహన్ లాల్, ఆర్య కాంబినేషన్ లో...

మహేష్, మోహన్ లాల్, ఆర్య కాంబినేషన్ లో...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : టాలీవుడ్ లో ఇప్పుడు మల్టి స్టారర్ చిత్రాలుఓ ట్రెండ్ గా మారాయి. దాన్ని తమిళమూ అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా...మహేష్, ఆర్య,మోహన్ లాల్ కాంబినేషన్ లో ఓ తమిళ,తెలుగు,మళయాళ భాషల్లో ఓ చిత్రం రూపొందించటానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు తమిళంలో హిట్టైన జిల్లా చిత్రం దర్శకుడు నేశన్ ప్లాన్ చేస్తున్నట్లు తమిళ వర్గాలు చెప్తున్నాయి. పీవీపి వారు ఈ చిత్రాన్ని నిర్మించే అవకాసం ఉందని,ఈ మేరకు టాక్స్ జరుగుతున్నట్లు వినికిడి. అయితే మహేష్ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా లేదా అనే విషయం తెలియదు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Mahesh with Mohan Lal & Arya

మహేష్ 'శ్రీమంతుడు'తాజా విశేషాలకు వస్తే...

మహేష్‌బా బుహీరోగా మై త్రీ మూవీస్‌ సంస్థ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. శ్రుతి హాసన్‌ కథానాయిక. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ సాగుతోంది. మహేష్‌, శ్రుతిలతో పాటు జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, సుకన్య తదితరులపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఇటీవల పొల్లాచిలో కొన్ని సన్నివేశాలు, పోరాట ఘట్టాలూ చిత్రీకరించారు.

షూటింగ్‌ తుది దశకు చేరుకొంటోంది. ఈ చిత్రానికి 'శ్రీమంతుడు' అనే పేరు పరిశీలిస్తున్నారు. సినిమాలో మహేష్‌ ధనవంతుడిగా కనిపిస్తారని, ఆయన పాత్ర చాలా స్త్టెలిష్‌గా ఉంటుందని చెబుతున్నారు. అయితే టైటిల్‌పై చిత్రబృందం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అలీ, వెన్నెల కిషోర్‌, సితార, తులసి తదితరులు నటిస్తున్నారు. మేలో ఈ చిత్రాన్ని విడుదల చేసే అవకాశం ఉంది.

English summary
Director Neason who earlier delivers super hit film Jilla with Vijay and Mohan Lal is looking forward to bring Mahesh Babu, Mohan Lal and Arya onto single rope.
Please Wait while comments are loading...