»   » కళ్లు చెదిరేలా మహేశ్‌బాబు సినిమా బిజినెస్.. ఫిగర్ తెలుస్తే షాకే..

కళ్లు చెదిరేలా మహేశ్‌బాబు సినిమా బిజినెస్.. ఫిగర్ తెలుస్తే షాకే..

Written By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ దర్శకుడు మురుగదాస్ డైరెక్షన్‌లో ప్రిన్స్ మహేశ్‌బాబు నటిస్తున్న ఇంకా పేరు పెట్టని చిత్రం విడుదలకు ముందే రికార్డు స్థాయిలో బిజినెస్ జరుగుతున్నట్టు సమాచారం. మహేశ్‌బాబు ఇంటర్‌పోల్
అధికారిగా నటిస్తున్న ఈ చిత్రం సుమారు రూ.100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్నది. ప్రీ రిలీజ్‌కు ముందే దాదాపు రూ.150 కోట్ల బిజినెస్ జరిగే అవకాశముందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

ఆంధ్రా, నైజాంలో రికార్డు

ఆంధ్రా, నైజాంలో రికార్డు

ఈ మూవీ ఫస్ట్‌లుక్ రిలీజ్ కాకముందే బిజినెస్ పూర్తయినట్టు ఫిలింనగర్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఆంధ్రా, సీడెడ్ హక్కులు రూ.36 కోట్లు, నైజాం ఏరియా రూ.20 కోట్ల వరకు బిజినెస్ జరిగినట్టు తెలుస్తున్నది.

భారీగా ఓవర్సీస్ రైట్స్

భారీగా ఓవర్సీస్ రైట్స్

ఇక ఓవర్సీస్ హక్కులకు కూడా భారీగా రేటు పలికినట్టు టాలీవుడ్ ట్రేడ్ అనలిస్టులు పేర్కొంటున్నారు. ఓవర్సీస్ కోసం సుమారు రూ.20 కోట్లకుపైగా అమ్ముడుపోయినట్టు తెలుస్తున్నది. ఈ చిత్రం తమిళ, తెలుగు భాషల్లో రూపొందుతున్న సంగతి తెలిసిందే.

తమిళంలోనూ భారీగా..

తమిళంలోనూ భారీగా..

తమిళంలో కూడా ఊహించని విధంగా బిజినెస్ ప్రతిపాదనలు వస్తున్నట్టు తెలుస్తున్నది. తమిళంలో మురుగదాస్‌కు ఉన్న క్రేజ్ వల్లనే మహేశ్ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తున్నట్టు సమాచారం. తమిళంలో ఈ సినిమా రూ.28 కోట్లకు పైగా బిజినెస్ చేసే అవకాశముందని సినీ వర్గాలు వెల్లడించాయి.

రికార్డు రేటుకు శాటిలైట్..

రికార్డు రేటుకు శాటిలైట్..

శాటిలైట్ హక్కుల విషయంలో కూడా బిజినెస్ రికార్డు స్థాయిలోనే జరిగే అవకాశం కనిపిస్తున్నది. తెలుగు, హిందీ శాటిలైట్ హక్కుల రూపంలో సుమారు రూ.26 కోట్లు వచ్చే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తున్నది. 100 కోట్లకు పైగా బిజినెస్ జరిగితే మహేశ్ కెరీర్‌లోనే భారీగా బిజినెస్ జరిగిన సినిమాగా రికార్డులకు ఎక్కుతుంది.

జూన్ 23న రిలీజ్

జూన్ 23న రిలీజ్

రకుల్ ప్రీత్ సింగ్, దర్శకుడు ఎస్‌జే సూర్య నటిస్తున్న ఈ చిత్రం రంజాన్ పండుగను పురస్కరించుకొని జూన్ 23న విడుదల కానున్నది. ఈ చిత్ర ఫస్ట్‌లుక్ త్వరలోనే విడుదల కానున్నది. ఫస్ట్‌లుక్ విడుదల
గురించి ఇటీవల మహేశ్‌బాబు ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.

English summary
Prince Maheshbabu latest movie in in news for pre-release business. Murugadoss movie is set record level business offer in multiple category. This movie is gearing up to release on June 23.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu