twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అందుకే పక్క ఇండస్ట్రీకి... ‘వైఎస్ బయోపిక్’ వెనక షాకయ్యే విషయాలు?

    By Bojja Kumar
    |

    Recommended Video

    వైఎస్ బయోపిక్‌ లో YSR పాత్రలో మలయాళ నటుడా ?

    2018 సంవత్సరం తెలుగు సినిమా పరిశ్రమలో గతంలో ఎన్నడూ రానన్ని బయోపిక్ చిత్రాలు ప్రేక్షకులను ముంచెత్తబోతున్నాయి. ఇప్పటికే ప్రముఖ నటి సావిత్రి జీవితంగా ఆధారంగా తెరకెక్కుతున్న 'మహానటి' చిత్రం షూటింగ్ దశలో ఉండగా.... మాజీ సీఎం, మహానటుడు ఎన్టీ రామారావు జీవితం ఆధారంగా మూడు బయోపిక్ చిత్రాలు రాబోతున్నాయి. అందులో ఒకటి బాలయ్య ప్రధాన పాత్రలో తేజ దర్శకత్వంలో వస్తుండగా, మరొకటి వర్మ దర్శకత్వంలో, మరొటి కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి దర్శకత్వంలో రాబోతోంది.

     మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా మూవీ

    మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా మూవీ

    తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా కూడా తెలుగులో ఓ సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి మహి రాఘవ్ దర్శకత్వం వహించబోతున్నారు.

     మలయాళ సూపర్ మమ్ముట్టి

    మలయాళ సూపర్ మమ్ముట్టి

    ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి వైఎస్ పాత్రలో కనిపించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ విషయం ఇంకా అఫీషియల్‌గా ఖరారు కాకపోయినప్పటికీ ఆయనే ఫైనల్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

    తెలుగులో ముందుకు రాని స్టార్స్

    తెలుగులో ముందుకు రాని స్టార్స్

    తెలుగులో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో నటించడానికి ప్రముఖ స్టార్స్ ఎవరూ ముందుకు రాలేదని తెలుస్తోంది. సెకండ్ గ్రేడ్ స్టార్స్ కొందరు చేయడానికి సిద్దంగా ఉన్నా.... వారితో చేస్తే సినిమాకు వ్యాల్యూ ఉండదనే ఉద్దేశ్యంతోనే దర్శకుడు పక్క ఇండస్ట్రీ వైపు దృష్టి మళ్లించినట్లు సమాచారం.

     రాజకీయ పరమైన ఇబ్బందులు ఉంటాయనే

    రాజకీయ పరమైన ఇబ్బందులు ఉంటాయనే

    తెలుగులో వైఎస్ఆర్ బయోపిక్‌లో నటిస్తే కొన్ని పొలిటికల్ ఇబ్బందులు ఉండే అవకాశం ఉండటంతో ఎవరూ ముందుకు రాలేదని తెలుస్తోంది. ఈ సినిమా చేస్తే ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న చంద్రబాబు పాత్రపై సెటైర్లు వేయాల్సి ఉంటుంది. దీంతో పాటు జగన్ మనిషిగా కూడా ముద్రపడే అవకాశం ఉంది. అందుకే ఎవరూ ముందుకు రాలేదట.

    మమ్ముట్టి అయితే నో ప్రాబ్లం

    మమ్ముట్టి అయితే నో ప్రాబ్లం

    పక్క రాష్ట్రాల్లో స్టార్స్ అయితే వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. వారికి మన రాష్ట్ర రాజకీయాలతో ఎలాంటి లింకు, అవసరం కానీ ఉండదు. అందుకే దర్శకుడు కూడా మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టిని ఎంచుకుకున్నారట. ఆయన స్టార్ ఇమేజ్ పరంగా, వయసు పరంగా కూడా ఈ సినిమాకు బాగా సెట్టవుతారనేది కూడా మరో కారణం.

     దర్శకుడికి అనుభవం ఉందా?

    దర్శకుడికి అనుభవం ఉందా?

    ‘వైఎస్ బయోపిక్' సినిమా చేయబోతున్న దర్శకుడు మహి రాఘవ్ ఇంతకు ముందు తెలుగులో తాప్సీ ప్రధాన పాత్రలో వచ్చిన ‘ఆనందో బ్రహ్మ' చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించింది. మరి వైఎస్ లాంటి మహానేత జీవితాన్ని తెరకెక్కించే విషయంలో ఇతడు ఏ మేరకు సక్సెస్ అవుతాడో చూడాలి.

     వైఎస్ జీవితంలోని వివాదాలు చూపిస్తారా?

    వైఎస్ జీవితంలోని వివాదాలు చూపిస్తారా?

    వైఎస్ఆర్ జీవితంలో చెప్పుకోదగ్గ మంచి విషయాలు అంటే డాక్టర్ గా ఆయన పేదలకు చేసిన సేవలు, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పేద ప్రజలకోసం ఆయన ప్రవేశ పెట్టిన పథకాలు. అదే సమయంలో ఆయన రాజకీయ, వ్యక్తిగత జీవితంలో కొన్ని వివాదాస్పద అంశాలు కూడా ఉన్నాయి. మరి వాటిని సినిమాలో చూపిస్తారా? లేదా? అనేది చూడాల్సిందే.

    ఈ ఏడాది తెలుగులో రాబోతున్న బయోపిక్ చిత్రాలు ఇవే

    ఈ ఏడాది తెలుగులో రాబోతున్న బయోపిక్ చిత్రాలు ఇవే

    ఈ ఏడాది తెలుగులో సావిత్రి జీవితంపై ‘మహానటి', ఉయ్యాల వాడ నరసింహారెడ్డి జీవితంపై ‘సైరా నరసింహారెడ్డి', పుల్లెల గోపీచంద్, ఎన్టీ రామారావు జీవితంపై బయోపిక్ చిత్రాలు రాబోతున్నాయి. హిందీలో సైనా నెహ్వాల్ జీవితంపై బయోపిక్ రాబోతోంది.

    English summary
    Film nagar source said that a biopic on former Chief Minister of Andhra Pradesh, YS Rajasekhar Reddy is currently in the pipeline and will be directed by Mahi Raghav. However, reports are also doing rounds that Malayalam top star Mammootty may be roped in to play the lead role of YS Rajasekhar Reddy.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X