మమతా మోహన్ దాస్ కి మళ్లీ కాన్సర్?
ఆమె కూడా చాలా ధైర్యంగా ...'నాకేం ఫర్వాలేదు..ట్రీట్ మెంట్ చేయించుకుంటున్నా. త్వరలో కోలుకుంటా' అంటూ అప్పట్లో ఆమె ఎంతో ఆత్మవిశ్వాసంతో చెప్పేది. ఆమె చెప్పినట్లుగానే చికిత్స చేయించుకోవడం, ఆరోగ్యవంతురాలవ్వడం జరిగింది. ప్రస్తుతం ఈ వ్యాధి తిరగబెట్టిందనే వార్త వినిపిస్తోంది.
ఈ మధ్యన ట్విట్టర్‌లో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు స్వయంగా మమతాయే తన అనారోగ్యం గురించి పేర్కొన్నట్లు తెలుస్తోంది. నిరోధించగల వ్యాధి ఉందని, దానికి చికిత్స చేయించుకుంటున్నానని, ఈసారి కూడా విజయవంతంగా బయటపడతానని ఆమె తెలిపినట్లు సమాచారం.
నాగార్జున తో చేసిన 'కేడి' తర్వాత తెలుగు సినిమాలకు దూరంగా ఉంటున్న మమతా మలయాళ చిత్రాలతో బిజీ అయ్యారు. తన మాతృభాషలో ఆమె నటించిన 'లేడీస్ అండ్ జెంటిల్‌మేన్' చిత్రం ఇటీవలే విడుదలయ్యింది. గత ఏడాది కాలంగా తీరిక లేకుండా సినిమాలు చేసిన మమతా ప్రస్తుతం చికిత్స కారణంగా దాదాపు ఆరు నెలల పాటు సినిమాలకు దూరంగా ఉండాలనుకుంటున్నారని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications












