»   » ఐశ్వర్యరాయ్‌తో ఎఫైర్ ఉదంటూ వ్యక్తి హంగామా!

ఐశ్వర్యరాయ్‌తో ఎఫైర్ ఉదంటూ వ్యక్తి హంగామా!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యరాయ్ పెళ్లి చేసుకుని తన భర్త అభిషేక్ బచ్చన్‌తో గత ఏడేళ్లుగా ఎంతో సంతోషంగా జీవితం సాగిస్తోంది. ఉన్నట్టుండి ఓ వ్యక్తి తెరపైకి వచ్చి ఆమెతో ఎఫైర్ ఉందంటూ నానా హంగామా సృష్టిస్తున్నాడు. అతన్ని శ్రీలంకకు చెందిన నిరోషన్ దేవప్రియగా గుర్తించినట్లు వార్తలు మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

తనకు గతంలో ఐశ్వర్యరాయ్‌తో ఎఫైర్ ఉందని, ఐశ్వరాయ్ అభిషేక్ బచ్చన్‌ను పెళ్లి చేసుకోవడం కారణంగా తాను మానసిక వేధనకు గురయ్యానని సదరు వ్యక్తి ఆరోపిస్తున్నాడని తెలుస్తోంది. ఆమెపై కేసు వేసేందుకు తన నైసీ రిఫర్ చేసిన ఓ లాయర్‌ను కూడా పెట్టుకున్నాడని, ఇందుకోసం రూ. 17 లక్షల రూపాయలుకూడా చెల్లించాడని...అయితే వారు ఐశ్వర్యరాయ్‌పై ఎలాంటి కేసు వేయకుండా అతన్ని మోసం చేసారని తెలుస్తోంది.

Man Claims Affair With Aishwarya Rai; Alleges Mental Stress

ప్రస్తుతం నిరోషన్ తన నైసీపై కోర్టులో కేసు వేసాడని, అతని వద్ద తీసుకున్న మొత్తాన్ని వాయిదా పద్దతుల్లో చెల్లించాలని కోర్టు ఆదేశించినట్లు తెలుస్తోంది. ఐశ్వర్యరాయ్‌పై ఆరోపణలు చేస్తున్న సదరు వ్యక్తి ప్రస్తుతం చైనాలో ఉంటున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

గతంలో ఐశ్వర్యరాయ్ బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, మరో హీరో వివేక్ ఒబెరాయ్‌తో ఎఫైర్ నడిపినట్లు వార్తలు వినిపించాయి. అయితే ఆ రూమర్లకు తెర దించుతూ ఐశ్వర్యరాయ్ 2007 అభిషేక్ బచ్చన్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. అప్పటి నుండి ఆమె తన భర్త అభిషేక్‌తో సంతోషంగా లైఫ్ లీడ్ చేస్తోంది. ఉన్నట్టుండి శ్రీలంకకు చెందిన వ్యక్తి ఐశ్వర్యరాయ్‌తో ఎఫైర్ ఉందంటూ తెరపైకి రావడం చర్చనీయాంశం అయింది.

English summary
Bollywood actress Aishwarya Rai Bachchan has been leading a happily married life with Abhishek Bachchan but now after seven years of their marriage, a man has come up with claims that he was in a relationship with the former Miss World.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu