»   »  అఖిల్‌ ఎంట్రీ దర్శకుడుని ఫైనల్ చేసేసారా?

అఖిల్‌ ఎంట్రీ దర్శకుడుని ఫైనల్ చేసేసారా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సిసింద్రీ హీరో గా నటించబోయే తొలి సినిమాకి దర్శకత్వం వహించేది ఎవరన్న విషయంపై ఇప్పటికే చాలా మంది పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అఖిల్ ఎప్పుడు,ఏ దర్శకుడుతో హీరోగా లాంచ్ కానున్నాడు అనేదే ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్. ఆటోనగర్ సూర్య దర్శకుడు దేవకట్టాతో చేస్తాండంటూ వార్తలు వస్తున్న నేపధ్యంలో మనం దర్శకుడు విక్రమ్ తోచేసే అవకాసం ఉందని మరో వార్త వినిపిస్తోంది. ఇవన్నీ ఇలా ఉంటే అఖిల్ కి మంచి కథ ఉందంటూ సీనియర్, జూనియర్ దర్శకులు నాగార్జునని కలుస్తూనే ఉన్నారట.

మరో పది రోజుల్లో... అంటూ అఖిల్‌ ఊరిస్తూనే ఉన్నాడు. తాను హీరోగా తెరంగేట్రం ఎప్పుడు చేస్తారు? ఎవరి దర్శకత్వంలో అన్న విషయం గురించి పరిశ్రమ ఆత్రుతగా ఎదురు చూస్తోంది. అభిమానులు కూడా ఎప్పటికప్పుడు ఆరా తీస్తూనే ఉన్నారు. దీంతో అఖిల్‌ ఆమధ్య మీడియాతో మాట్లాడుతూ... మరో పది రోజుల్లో నేను చేయబోయే సినిమా ఏంటన్నది చెబుతా అని ప్రకటించారు. ఆ గడువు దాటి మరో పది రోజులు కూడా పూర్తయింది. అయినా అఖిల్‌ ఇంకా కథలు వింటూనే ఉన్నారు. అయితే 'మనం' సినిమాని తీసిన విక్రమ్‌కుమార్‌ దర్శకత్వంలోనే అఖిల్‌ తెరంగేట్రం చేయొచ్చని ఫిల్మ్‌నగర్‌ సమాచారం.

Manam director to helm Akhil's debut?

ఇటీవల నాగార్జున మాటల్నిబట్టి చూసినా అదే నిజం అనిపిస్తోంది. ''విక్రమ్‌ చెబుతున్న కథని వింటున్నాడు అఖిల్‌'' అని నాగార్జున ఇటీవల చెప్పారు. 'మనం'లో అఖిల్‌ని ముప్పై సెకన్లపాటు చూపించారు విక్రమ్‌. అది అభిమానులకు ఎంతగానో నచ్చింది. అందుకే.. నాగార్జున కూడా విక్రమ్‌ చేతులమీదుగానే అఖిల్‌ని తెరకు పరిచయం చేయాలని నిర్ణయించుకొన్నారట. ఆయన చెప్పిన కథ కూడా అఖిల్‌కీ, నాగార్జునకీ బాగా నచ్చిందట. అన్నీ కుదిరితే ఇదే కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కడం ఖాయం అంటున్నారు.

'మనం'లో అఖిల్‌ కనిపించేది 30 సెకన్లే. అది చూసి అంచనాకు రాలేం. 30 సెకన్ల వాణిజ్యప్రకటనలో అందరూ అందంగానే కనిపిస్తారు. పూర్తిస్థాయి హీరోగా ఎలా రాణిస్తాడో చూడాలి అంటున్నారు నాగార్జున. ఆయన రెండో కుమారుడు అఖిల్ హీరోగా లాంచ్ కాబోయే చిత్రం పై అంతటా ఎక్సపెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. ఈ నేపధ్యంలో నాగార్జున పుత్రోత్సాహంతో ఇలా స్పందించారు.

అలాగే నవ్వుతూ... ''అఖిల్‌ మరో మహేష్‌ అవుతాడు.. అంటుంటే అంతకంటే ఆనందం ఉంటుందా? ఇంకొంతమంది చైతూకి పోటీ వస్తున్నాడా? అని అడుగుతున్నారు. చైతన్య సంగతి పక్కన పెట్టండి. అఖిల్‌కి పోటీగా నేనున్నాను కదా.? నన్ను దాటమనండి.అఖిల్‌కి తనపై తనకు నమ్మకం ఎక్కువ. చిన్నతనం నుంచి ఇలాగే కాన్ఫిడెన్స్‌గా ఉండేవాడు. అఖిల్‌ సినిమాకి నేనే నిర్మాత అని అన్నారు.

English summary
Vikram Kumar has proved his mettle as director and now the Filmnagar folks are biting their ears that he will be wielding the megaphone for Akkineni Akhil's debut movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu