»   » ఎక్కడ చూసినా మంచు లక్ష్మి అండర్ వేర్ గోలే

ఎక్కడ చూసినా మంచు లక్ష్మి అండర్ వేర్ గోలే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : వేష,భాషల్లో మొదటనుంచీ డిఫెరెంట్ గా ఉండే మంచు లక్ష్మి...సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో మరింత విభిన్నంగా ఉంటోంది. ఆమె రీసెంట్ గా పెట్టిన పోస్ట్ సంచలనం రేపింది. నేను అండర్ వేర్ వేసుకోకూడదని నిశ్చయించుకున్నా అని ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టింది. ఇదేంటి ఇలాంటి పోస్ట్ ఆమె స్టేటస్ గా వచ్చింది అని ఆమె స్నేహితులు, సన్నిహితులు కంగారుపడి ఎవరన్నా ఆమె ఎక్కౌంట్ ని హ్యాక్ చేసారేమో అని ...ఫోన్ చేసి చెప్దామని ట్రై చేస్తే సెల్ ఆఫ్ చేసి ఉంది.

కాస్సేపటికి క్రింద ఉన్న కామెంట్స్ అన్నీ చదువుకుని నవ్వేస్తూ... " హ...హ..హ...హ...మీరు మీ సెన్సాఫ్ హ్యూమర్... నాకు ఫోన్ చేయకండి...సరదా కోసం పెట్టా !!!" అంతే అని చెప్పేసింది. అయితే తర్వాత ఏమనుకుందో ఏమో కానీ ఆ పోస్ట్ ని తీసేసింది. అయితే అప్పటికే ఆ వార్త అంతటా పాకిపోవటంతో అందరూ ఆమె ఫేస్ బుక్ పేజీ ఓపెన్ చేసి చూడటం మొదలెట్టారు. రీసెంట్ గా ఆమె నటించిన చందమామ కథలు భాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఆ చిత్రంపై మంచి ఆశలు పెట్టుకుంది.

లక్ష్మి మాట్లాడుతూ... ''మంచి కథ అనిపిస్తే చాలు... డబ్బుల గురించి ఆలోచించకుండా వెళ్లి నటించి వచ్చేదాన్ని. ఇక నుంచి మాత్రం డబ్బులు తీసుకోవాలనుకొంటున్నా. ఎందుకంటే మా నాన్న ధనవంతుడు కానీ నేను కాదు. ఈ ప్రయాణం సంతృప్తిగానే ఉంది. మనసుకు నచ్చిన కథల్లో నటిస్తున్నా. నిర్మాతగా యువతరం అభిరుచులకు తగ్గ సినిమాలు తీస్తున్నా. 'గుండెల్లో గోదారి' చిత్రం నాకు ఎంతో పేరు తెచ్చిపెట్టింది. ఆ చిత్రం తమిళంలో అంతగా ఆదరణ పొందలేదు కానీ... తెలుగులో మాత్రం లాభాలు తెచ్చిపెట్టింది. ఇకపై నా నిర్మాణంలో మరిన్ని సినిమాలు వస్తాయి''.'' అన్నారు మంచు లక్ష్మీప్రసన్న.

Manchu Lakshmi Face Book post shocks

'మోహన్‌బాబు కూతురేంటి? సినిమాల్లో నటించడమేమిటి?' అని చాలామంది అనుకొన్నారు. ఆ మాటలే నాకు సవాల్‌ విసిరాయి. 'ఎందుకు నటించకూడదు?' అనే పంతం వచ్చింది. ఇప్పుడు నందితో వారందరికీ సమాధానం చెప్పాననిపిస్తోంది. అందరిలా ఈ పురస్కారం ఎవరెవరికో అంకితం ఇవ్వదలుచుకోలేదు. ఇది నా నంది. నంది ఫలితాలు వెలుబడినప్పుడు నేను చెన్నైలో ఉన్నాను. చిన్నికృష్ణ గారు ఫోన్‌ చేసి చెప్పారు. ఆ క్షణమే ఎగిరి గంతేయాలనిపించింది. అక్కడి నుంచి వరుసగా ఎన్ని ఫోన్లో. నిజంగానే ఎలా ప్రతిస్పందించాలో ఇప్పటికీ అర్థం కావడం లేదు అన్నారు.

అలాగే ప్రతినాయికగా అడుగుపెడితే.. జీవితాంతం ఆ ముద్రే పడిపోతుందేమో అని నిజంగానే భయపడ్డా. కానీ నాకు నేనే సర్దిచెప్పుకొన్నా. డిస్నీవాళ్ల సినిమా ఇది. అంత పెద్ద నిర్మాణ సంస్థలో అవకాశం ఎలా వదులుకో ను? నాన్నగారు కూడా మొదట్లో ఒప్పుకోలేదు. తరవాత ఆయనే ప్రోత్సహించారు. థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు ఎన్ని విజిల్స్‌ వేశారో. సినిమా పూర్తయ్యాక 'నీ నటనకు నా గులామ్‌..' అన్నారు. ఆ మాట ఎప్పటికీ మర్చిపోలేను. పిల్లలెవరైనా భోజనం చేయకపోతే 'ఐరేంద్రీ వస్తుంది..' అని భయపెడితే గబగబా తినేస్తున్నారట. ఇలాంటివి వింటుంటే మరింత సంతృప్తిగా ఉంటుంది. మొన్నీమధ్య సుస్మితాసేన్‌ 'అనగనగా ఓ ధీరుడు' డీవీడీ క్యాసెట్‌ అడిగి మరీ తీసుకెళ్లింది అంటూ ఆనందం వ్యక్తం చేసారామె.

English summary

 Manchu Lakshmi Prasanna surprised her friends and Facebook followers by changing her status to: “I’ve decided to stop wearing underwear.” Shocked Lakshmi friends asked her whether her account was hacked. When they tried to call her she wontedly switched off her phone.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu