»   » ఎన్టీఆర్, నాగచైతన్యలతో మోహన్ బాబు కుమార్తె!?

ఎన్టీఆర్, నాగచైతన్యలతో మోహన్ బాబు కుమార్తె!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

తన సోదరుడు మంచు మనోజ్ తో ఝుమ్మంది నాదం చిత్రం నిర్మిస్తున్న మంచు లక్ష్మీ ప్రసన్న త్వరలో మరో రెండు పెద్ద ప్రాజెక్టులకు అంకురార్పణ చేయనుందని తెలుస్తోంది. ఆ హీరోలు మరెవరో కాదు ఎన్టీఆర్, నాగ చైతన్య. ఈ మేరకు ఆమె ఎన్టీఆర్ తో, నాగార్జునతో కమిట్ మెంట్ తీసుకున్నట్లు సమాచారం. అయితే కథా,దర్శకుడు పక్కాగా ఓకే చేసుకున్నాకే డేట్స్ కేటాయించగలనని, అదీ మినిమం మూడు నెలలు ముందు తెలియచేయాలని ఎన్టీఆర్ కండిషన్ పెట్టారని వినికిడి. ఆ ప్రయత్నాల్లో ఉన్న లక్ష్మి ప్రసన్న ఈలోగా విష్ణుతో ఓ చిత్రం చేయనుంది. ఝుమ్మంది నాదం రిజల్ట్ ని బట్టి మంచు మనోజ్ తో ఊ కొడతారా ఉలిక్కి పడతారా అనే ప్రాజెక్టు ఉండనుంది. కృష్ణ వంశీ దగ్గర పనిచేసిన రాజా ఈ ధ్రిల్లర్ ని డైరక్ట్ చేయనున్నాడు. అలాగే ఝుమ్మంది నాదం పాటలు ఇఫ్పటికే మార్కెట్లో రిలీజై మంచి టాక్ తెచ్చుకోగా...ఆ చిత్రంలో నటిస్తున్న హీరోయిన్ తాప్సికి వరస ఆఫర్స్ రావటం ప్రారంభమయ్యాయి. ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం శక్తి, బృందావనం చిత్రాలలో బిజీగా ఉన్నారు. నాగచైతన్య...అజయ్ భుయాన్, సుకుమార్ చిత్రాలు చేస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu