»   »  తాప్సీని వేశ్యగా చూడాలని మంచు లక్ష్మి ప్రసన్న పట్టుదల

తాప్సీని వేశ్యగా చూడాలని మంచు లక్ష్మి ప్రసన్న పట్టుదల

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఝుమ్మందినాదం ఫేమ్ తాప్సీని వేశ్య అవతారంలో చూడాలని మంచు లక్ష్మి ప్రసన్న తెగ ముచ్చటపడుతున్నట్లు తెలుస్తోంది. తన సోదరుడు మంచు మనోజ్ చేస్తున్న వేదం చిత్రం తమిళంలో రీమేక్ అవుతున్న సందర్భంలో ఆమె తాప్సీని అమలాపురం సరోజ(అనుష్క) పాత్రకు తమిళ నిర్మాతలకు రికమెండ్ చేస్తోంది. అంతేగాక ఆ పాత్ర చేయమని తాప్సీని ఫోర్స్ చేస్తోందని వినికిడి. అనుష్క కన్నా ఆ పాత్రలో తాప్సీ అయితే మరింత అందాలు విరజిల్లుతుందని దాంతో భాక్సాఫీస్ కి మరింత కలెక్షన్స్ వస్తాయని, అంతేగాక తెలుగు డబ్బింగ్ రైట్స్ కూడా అమ్ముకోవచ్చని లెక్కలు చెప్తోందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. అయితే తాప్సీ మాత్రం ఇంకా తలూపలేదట. కానీ తాప్సీకి ప్రస్తుతం మంచు లక్ష్మి మెంటర్ గా ఉంటోంది కాబట్టి ఓకే చెయ్యచ్చు అంటున్నారు. ఇక తాప్సీ చెయ్యకపోతే నమిత ను ఫిక్స్ చేసేస్తారు. తమిళ వెర్షన్ లో మంచు మనోజ్ తన పాత్ర రాక్ స్టార్ ను తానే చేస్తున్నాడు. ఇక ఈ చిత్రాన్ని తమిళంలో తీస్తోంది ఆర్.బి. చౌదరి. శింబుని కేబుల్ రాజు పాత్రకు ఇప్పటికే అడగటం జరిగింది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu