»   » అసలు నా గురించి అలా ఎలా ఊహించాడో?? మంచులక్ష్మి రాజమౌళిని తిట్టిందా!?

అసలు నా గురించి అలా ఎలా ఊహించాడో?? మంచులక్ష్మి రాజమౌళిని తిట్టిందా!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

శివగామి భారత దేశ సినీ సంచలనం బాహుబలిలో కీలకమైన పాత్ర దాదాపు ఈ పాత్రమీదనే సినిమా కథ మొత్తం ఆధార పడిఉంటుంది. మరలాంటి పాత్రని చేయాలీ అంటేనటనలో చాలా అనుభవం ఉన్న నటి కావాలి... అంతే కాదు ఆ నటి కి జనం లో క్రేజ్ కూడా బాగానే ఉండాలి ఆరెండూ ఉన్న నటీమణూల్లో శ్రీదేవి ఒకరు.., శివగామి పాత్ర కోసం అతిలోక సుందరిని తీసుకుంటే ఎలాఉంటుందీ అనుకున్నాడట రాజమౌళి. కానీ శ్రీదేవి ఒప్పుకోలేదు కారణం తెలుగు సినిమాలో ఒకప్పుడు టాప్ హీరోయింగా కనిపించిన తాను మళ్ళీ తల్లి పాత్రలో కనిపించట్qఅం ఏమిట్టి అనుకుందో, లేక మరీ తెలుగులో నేను నటించటం ఏమిటి చీప్ గా అనుకుందో కానీ ఈ ఆఫర్ కి నో చెప్పేసింది శ్రీదేవి... (అయితే మళ్ళీ అదే పాత్రని పోలిన పాత్రనిమాత్రం తముఇళ సినిమా పులి లో చేసింది. అయితే అక్కడ మంచి దెబ్బే పడిందనుకోండి అది వేరే విషయం)

శ్రీదేవి నో చెప్పేయటం తో మళ్ళీ బాలీవుడ్ లోనే "టాబూ"ని తీసుకోవలనుకున్నాడు అయితే ఆ ముదురు భామకీ అమ్మ అనిపించుకోవాలనిపించలేదేమో కానీ టాబూ కూడా ఈ ఆఫర్ ని వదులుకుంది అప్పుడు మన టాలీవుడ్ అమ్మోరు రమ్య కృష్ణ దగ్గరికి వచ్చింది శివగామి... అలా మాహిష్మతీ రాజమాత శివగామి గా రమ్యకృష్ణ కనిపించింది. అయితే ఈ మొత్తం వ్యవహారం లోనూ మనకు తెలియని ఇంకో విషయం ఉంది... ఎంతవరకూ నిజమోకానీ ఇదే పాత్ర కోసం "మంచ్వ్హు లక్ష్మి నికూడా సంప్రదించారట. అయితే అసలు ప్రభాస్ కి తల్లిగా చేసే వయసా నదీ..? నేను చేయనూ అని నిర్మొహమాటన్ గా చేప్పేసిందట లక్ష్మి.. ఆమె మాటల్లోనే చెప్పాలంటే...

Manchu Lakshmi reveals why she rejected Baahubali

'శివ‌గామి పాత్ర‌కు న‌న్ను అడ‌గ‌డం రూమ‌ర్ కాదు. నిజమే....! రాఘ‌వేంద్ర‌రావుగారి అబ్బాయి ప్ర‌కాష్ నాకు ఫోన్ చేసి ఆ పాత్ర ఆఫ‌ర్ చేశాడు. ఐతే వెంట‌నే నో చెప్పాను. శివ‌గామి పాత్ర న‌చ్చ‌క ఇలా చెప్ప‌లేదు. ప్ర‌భాస్ కు అమ్మ‌గా న‌టించ‌డం అనే ఆలోచ‌న నాకు న‌చ్చ‌లేదు. ఆ ఆలోచ‌నే ఊహించ‌లేను. సినిమాలో నాకు అమ్మ ఫీలింగ్ కాకుండా ఇంకో ఫీలింగ్ వ‌స్తే క‌ష్టం. ప్ర‌కాష్ కు నో చెబుతూ రాజ‌మౌళిని కూడా రెండు మాట‌లు అన్నాను. న‌న్ను ప్ర‌భాస్ అమ్మ‌గా ఎలా ఊహించుకున్నారో అని. ఐతే నా కంటే ముందు శ్రీదేవి.. ట‌బుల‌ను కూడా ఈ పాత్ర‌కు అడిగార‌ట‌. వాళ్ల లీగ్ లో న‌న్ను చేర్చినందుకు చాలా హ్యాపీ. రాజ‌మౌళి గారు ఇంకేదైనా పాత్ర ఆఫ‌ర్ చేస్తే నేను త‌ప్పకుండా చేస్తాను. ఐతే శివ‌గామి పాత్ర‌కు నా వాయిస్ ఉండుంటే వేరేగా ఉండేది. న‌న్ను కేవ‌లం వాయిస్ ఇవ్వ‌మంటే మాత్రం ఇచ్చేదాన్ని. కానీ ప్ర‌భాస్ త‌ల్లిగా నటించ‌డం మాత్రం నా వ‌ల్ల కాదు''అని ల‌క్ష్మి చెప్పింది.

English summary
The News was revealed by Manchu Lakshmi when she appeared on a TV show yesterday. Adding further, Lakshmi said that as she found playing Prabhas’s mom quite funny and weird, she apparently rejected the role.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu