»   »  టైటిల్ ఎన్టీఆర్ ఫ్లాఫు సినిమాను గుర్తు తెస్తోంది

టైటిల్ ఎన్టీఆర్ ఫ్లాఫు సినిమాను గుర్తు తెస్తోంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఈ రోజుల్లో సినిమాకి టైటిల్ అనేదే సెల్లింగ్ పాయింట్ గా మారింది. రిలీజ్ కు ముందు సినిమా ఎలా ఉంటుందో తెలియదు..అలాంటప్పుడు టైటిల్ జనాల్లోకి బాగా నానితే ఓపినింగ్స్ బాగుంటాయని దర్సక, నిర్మాతలు భావిస్తూంటారు. అలాగే టైటిల్స్ కు సైతం రకరకాల నమ్మకాలు జోడించి మరీ సెట్ చేస్తూంటారు. అయితే ఇప్పుడు మంచు మనోజ్ కొత్త చిత్రం కోసం పెట్టిన టైటిల్ నెగిటివ్ వైబ్రేషన్స్ వస్తున్నాయంటున్నారు. ఇంతకీ మనోజ్ కొత్త చిత్రం టైటిల్ 'కరెంటు తీగ' .

ఎన్టీఆర్ కెరీర్ లో పెద్ద ఫ్లాపుగా నమోదైన ఊసరవెల్లిలో డైలాగు('కరెంట్ తీగ కూడా నాలానే సన్నాగా ఉంటుంది.. కానీ పట్టుకుంటే దానమ్మ షాక్ కొట్టేస్తుంది') ద్వారా 'కరెంట్ తీగ' ...పదం పాపులర్ అయ్యింది. అలాగే సుశాంత్ హీరోగా వచ్చిన 'కరెంటు' చిత్రం కూడా భాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కాలేదు. ఈ రెండు గుర్తు చేస్తూ ఇలాంటి టైటిల్ మనోజ్ కు అవసరమా అంటున్నారు. మార్చుకుంటే బాగుంటుందని అభిమానులు సూచిస్తున్నారు.

Manchu Manoj new film title ‘Current Teega’

ఇక మంచు విష్ణుతో 'దేనికైనా రెడీ' అనిపించారు జి.నాగేశ్వరరెడ్డి. ఇప్పుడు తమ్ముడు మనోజ్‌తో షాక్‌ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. మంచు మనోజ్‌ - జి.నాగేశ్వరరెడ్డి కలయికలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌'తో ఆకట్టుకొన్న రకుల్‌ ప్రీత్‌సింగ్‌ హీరోయిన్ . ఈ చిత్రానికి 'కరెంటు తీగ' అనే పేరును పరిశీలిస్తున్నారు. కథ పూర్తిస్థాయిలో సిద్ధమైంది.

ఈ చిత్రం మే రెండోవారంలో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. మనోజ్‌ శైలికి తగినట్టే ఆద్యంతం వినోదాత్మకంగా సాగే చిత్రమిది. యాక్షన్‌ అంశాలకూ ప్రాధాన్యం ఉంది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించనున్నారు. పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి. 'పాండవులు పాండవులు తుమ్మెద' తరవాత మనోజ్‌ నటిస్తున్న చిత్రమిదే.

English summary

 Manchu Manoj’s new movie directed by G.Nageswara reddy is titled 'Current Teega' reminding Jr.NTR’s Current teega dialogue from Oosaravelli movie. Rakul Preet Singh was selected as the heroine.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu