మంచు మనోజ్ రెమ్యునరేషన్.. మిరాయ్ కి ఎన్ని కోట్లు తీసుకున్నారో తెలుసా?
టాలీవుడ్ స్టార్ హీరో మంచు మనోజ్ ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. కొన్నాళ్లపాటు ఫ్యామిలీ గొడవలు, ఇతరత్రా విషయాలతో ఆయన తన కెరియర్ పై సరిగా ఫోకస్ చేయలేకపోయారు. కానీ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ భారీ చిత్రాలతో, రొటీన్ కి భిన్నమైన పాత్రలను పోషిస్తూ తన అభిమానులతో పాటు నార్మల్ ఆడియన్స్ అని కూడా ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. మొత్తానికి మంచు మనోజ్ కం బ్యాక్ ఇవ్వడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.
ఎప్పటికీ మంచు మనోజ్ భైరవం చిత్రంతో చాలా గ్యాప్ తర్వాత వెండితెరపై మెరిశారు. తన మాస్ పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక ఆ వెంటనే ఇక ఆ వెంటనే సైంటిఫిక్ యాక్షన్ ఫిలిం మిరాయ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సెప్టెంబర్ 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి ప్రేక్షకులను అలరిస్తున్న తేజ సజ్జ హీరోగా నటించిన చిత్రం ఇది. హీరోయిన్ గా రితిక నాయక్ నటించింది. శ్రియ శరన్, జగపతిబాబు, జయరాం వంటి స్టార్ క్యాస్ట్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు.

అయితే అందరికంటే మంచు మనోజ్ నటించిన మహావీర్ లామా అనే నెగటివ్ రోల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. మంచు మనోజ్ ఆ పాత్రలో పూర్తిగా లీనమై ఆడియన్స్ను తన వైపు తిప్పుకోగలిగారు. మొత్తానికి ఈ చిత్రంతో మంచు మనోజ్ కు బ్లాక్ బస్టర్ హిట్ పడింది. మరోవైపు మిరాయ్ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబడుతుంది. ఇప్పటివరకు ఈ చిత్రం 100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి బ్లాక్ బస్టర్ హిట్టును సొంతం చేసుకుంది. అయితే ఈ చిత్రానికి మంచు మనోజ్ ఎన్ని కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నారనేది ఆసక్తికరంగా మారింది.
కాగా అందరికంటే ఎక్కువగా మంచు మనోజ్ కే రెమ్యూనరేషన్ దక్కిందని సినీ ప్రముఖులు తెలియజేస్తున్నారు. హీరో తేజ సజ్జ రెండు కోట్ల రెమ్యూనిరేషన్ తీసుకోగా, మంచు మనోజ్ మాత్రం 2.75 కోట్ల పారితోషికాన్ని అందుకున్నారని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఇక శ్రియా శరన్ కూడా రెండు కోట్ల రూపాయల పారితోషికాన్ని అందుకున్నారని అంటున్నారు. ఏదేమైనా ఈ చిత్రంతో మనోజ్ భారీ సక్సెస్ ను అందుకున్నారు. నెక్స్ట్ డేవిడ్ రెడ్డి, రక్షక్, వాట్ ద ఫిష్ వంటి చిత్రాలతో అలరించడానికి సిద్ధమవుతున్నారు.
ఇక మిరాయ్ చిత్రాన్ని టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ కంపెనీ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ గ్రాండ్ గా నిర్మించింది. నిర్మాత టీవీ విశ్వ ప్రసాద్ మిరాయ్ చిత్రం కోసం రూ.65 కోట్ల బడ్జెట్ ను ఖర్చు పెట్టారని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం విడుదలైంది. కాగా ఈ చిత్రానికి గౌర హరి సంగీతం అందించడం విశేషం. ఆయన మునుపు హను-మ్యాన్ చిత్రానికి అద్బుతమైన సంగీతాన్ని అందించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











