»   » టైటిల్ మాత్రమే ఉంది కథ వండుతున్నారు

టైటిల్ మాత్రమే ఉంది కథ వండుతున్నారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సాధారణంగా కథ రాసుకుని దానికి తగ్గ టైటిల్ అన్వేషించి పెడుతూండటం సహజంగా జరుగుతూంటుంది. అయితే కథకి, టైటిల్ కీ సంభంధం లేని సినిమాలు కూడా వస్తూంటాయి. అయితే టైటిల్ అనుకుని దానికి తగ్గ కథ వెతకటం మాత్రం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అటువంటి సాహసం మంచు మనోజ్ చేస్తున్నాడు. ఆయన వద్ద సన్నాఫ్ పెదరాయుడు అనే టైటిల్ ఉంది. పెద రాయుడు చిత్రం పెద్ద హిట్ అవటంతో ఈ టైటిల్ పెడితే క్రేజ్ వస్తుందనే భావనతో దాన్ని ఫిక్స్ చేసేసారు. అయితే ఇప్పుడు ఆ టైటిల్ కి తగ్గ స్దాయిలో కథ అవసరమైంది.

దానికి తగ్గట్లు అప్పట్లో పెదరాయుడు మెగా హిట్ చిత్రం. దాంతో ఏ మాత్రం తేడా వచ్చినా ఈ సన్నాఫ్ పెద రాయుడు సినిమాని ఏకేస్తూ టైటిల్ పాడు చేసేసారు అంటారు. దాంతో ఖచ్చితంగా స్క్రిప్టుపై కసరత్తు చేయాల్సి ఉంటుంది. ఇదే విషయాన్ని మంచు మనోజ్ సైతం మీడియాకు స్పష్ట చేసారు. మనోజ్ మాట్లాడుతూ.. సన్నాఫ్ పెద రాయుడు సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. ఇంకా స్క్రిప్ట్ దశలోనే వుంది అన్నారు. స్క్రిప్టు పూర్తయ్యాక దర్శకుడుని వెతికి ఈ ప్రాజెక్టుని పట్టాలు ఎక్కిస్తారన్నమాట. అంతేకాదు మోహన్ బాబు ని సైతం ఈ ప్రాజెక్టులోకి లాక్కొస్తారు అంటున్నారు.

Manchu Manoj's Son of Pedarayudu ready only with title!

ప్రస్తుతం మనోజ్ దృష్టి మొత్తం ఆయన తాజా చిత్రం కరెంట్‌తీగ పై ఉంది. ఆ చిత్రంలో తన పాత్ర గురించి చెప్తూ... పాండవులు పాండవులు తుమ్మెద తరువాత కరెంట్‌తీగ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాను. దీనికి జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఇంతకు ముందు విష్ణు అన్నయ్యతో దేనికైనా రెడీ వంటి సూపర్‌డూపర్ హిట్టిచ్చారాయన. ఇప్పటి వరకు నేను పనిచేసిన దర్శకుల్లో కరెక్ట్‌గా నా బెండుతీసి నాతో వర్క్ చేయించుకుంటున్నారు. రాఘవేంద్రరావు, చంద్రశేఖర్ ఏలేటిల తరువాత జి.నాగేశ్వరరెడ్డి అంతబాగా అంకిత బావంతో పనిచేస్తున్నారు.

సినిమా చాలా బాగా వస్తోంది. ఇందులో ఫుల్ ఎనర్జీతో రఫ్ అండ్ టఫ్‌గా వుండే ఓ పల్లెటూరి యువకుడిగా కనిపిస్తాను. దేవుడి దయవల్ల సినిమా బాగా వస్తోంది. ఈ జూన్ చివరికి సినిమా పూర్తవుతుంది. ఆగస్టులో రిలీజ్ చేయాలనుకుంటున్నాం. ఇందులో జగపతిబాబుగారు కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే ప్రత్యేక పాత్రలో సన్నిలియోన్ నటిస్తోంది. ఆమె పాత్రకున్న ప్రాముఖ్యత ఎలాంటిదో చెప్పడం కంటే సినిమా చూస్తేనే అర్థమవుతుంది అన్నారు.

English summary
Son Of Pedarayudu is coming out that the film which was announced with much fanfare along with Manchu family heroes, is ready only with the title.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu