»   » రామ్ చరణ్ మూవీలో విలన్ గా మంచు మనోజ్?

రామ్ చరణ్ మూవీలో విలన్ గా మంచు మనోజ్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రామ్ చరణ్ త్వరలో తమిళంలో హిట్టయిన ‘థాని ఒరువన్' తెలుగు రీమేక్ లో నటించబోతున్న సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతోంది. తమిళంలో విలన్ పాత్ర పోషించిన అరవింద స్వామి తెలుగులోనూ నటిస్తున్నట్లు వార్తలు వినిపించాయి. తాజాగా మరో ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. అరవింద స్వామి కాదు... తెలుగు హీరో మంచు మనోజ్ ఈ చిత్రంలో విలన్ గా నటించే అవకాశం ఉందని అంటున్నారు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మంచు మనోజ్ స్పందిస్తూ.....విలన్ క్యారెక్టర్‌లో నటించాలనే కోరిక ఉన్నట్లు ఇటీవల తెలిపాడు. ఈ మేరకు చరణ్ సినిమాలో ప్రతినాయకుడిగా నటించడానికి సిద్ధమయినట్లు ప్రచారం జరుగుతోంది. మరి సినిమా నిర్మాతల నుండి అఫీషియల్ సమాచారం వస్తే తప్ప అసలు విషయం తేలనుంది.

Manchu Manoj Turning Villain For Ram Charan?

ఈ చిత్రాన్ని మెగాసూపర్ గుడ్ ఫిల్మ్స్ అధినేత ఎన్వీ ప్రసాద్, డివివి దానయ్య కలిసి నిర్మించాలని అనుకున్నారు. డివివి దానయ్య తప్పుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆ స్థానంలో అల్లు అరవింద్ నిర్మాతగా కొనసాగనున్నట్లు సమాచారం. ఇటీవల రామ్ చరణ్ తో ‘బ్రూస్ లీ' నిర్మించిన దానయ్య ఆ సినిమా సరిగా ఆడక పోవడంతో ఫైనాన్షియల్ గా టైట్ పొజిషన్లో ఉన్నట్లు టాక్. అందుకే ‘థాని ఓరువన్' సహ నిర్మాతగా తప్పుకున్నట్లు చెబుతున్నారు.

రామ్ చరణ్ ‘బ్రూస్ లీ' సినిమా ఫలితంతో రూటు మార్చాడు. ఈ సినిమాకు ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోకూడదని, కేవలం సినిమా విడుదలైన తర్వాత వచ్చే లాభాల్లో షేరింగ్ మాత్రమే తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చాడట. ఇలా చేయడం వల్ల నిర్మాణ వ్యయం తగ్గుతుందని, సినిమాను నష్టాల భారి నుండి తప్పించవచ్చని అంటున్నాడు.

అల్లు అరవింద్ సలహా మేరకే రామ్ చరణ్ రెమ్యూనరేషన్ విషయంలో రూటు మార్చాడని అంటున్నారు. థాని ఒరువన్ మూవీలో మాస్ మసాలా ఎలిమెంట్స్ ఏమీ ఉండవు. కేవలం కథ ఆధారంగా మాత్రమే నడిచే ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను రూ. 25 కోట్ల బడ్జెట్‌లో తెరకెక్కించే అవకాశం ఉంది.

English summary
Film Nagar source said that, Manchu Manoj Turning Villain For Ram Charan.
Please Wait while comments are loading...